ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మీ ముఖ సౌందర్యానికి కొన్ని చిట్కాలు... (Curd | Multani Matti | Panneer | Pappaya)
FILE
ముఖ సౌందర్యానికి కొన్ని చిట్కాలు మీకోసం..

పెరుగుతో సున్నిపిండి పేస్ట్‌ను ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలకు చెక్ పెట్టవచ్చు. అలాగే ముల్తానీ మట్టి పొడిని పన్నీరుతో కలిపి ముఖానికి పట్టించి పది, పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతమవుతుంది.

బాగా పండిన బొప్పాయి పండును మిక్సిలో నున్నగా రుబ్బి, నిమ్మరసం కలిపి.. ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా పట్టించి పది నిమిషాల తర్వాత స్నానం చేస్తే మొటిమలు, చర్మవ్యాధులు దూరమవుతాయి. మీ చర్మం పొడిబారినట్లుంటే పాలులో బియ్యంపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. అర్థగంట తర్వాత కడిగేస్తే మీ చర్మం మిలమిలలాడుతుంది.

ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌ను క్రమం తప్పకుండా కంటి రెప్పలకు పూస్తూ వస్తే కంటికి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆయిల్‌తో ఐబ్రోస్ కాంతివంతంగా తయారవుతాయి. కరివేపాకును బాగా ఎండబెట్టి పొడి చేసుకుని కొబ్బరి నూనెతో కలపి జుట్టుకు రాసుకుంటే మీ జుట్టు నలుపుగా కాంతివంతంగా ఉంటాయి.
సంబంధిత సమాచారం
Feedback Print