చాలా మందికి కంటికింద నల్లటి వలయాలు, మోచేతులకు నల్లటి మచ్చలు ఉంటుంటాయి. ముఖ్యంగా ఎర్రటి చర్మం కలిగిన ముఖం కలిగిన వారికి ఈ తరహా మచ్చలు చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. ఇలాంటి వాటికి చిన్నపాటి చిట్కాలను పాటిస్తే.. వైద్యుని సాయం లేకుండా కొంతమేరకు నివారించుకోవచ్చు. ఇలాంటి నల్లటి వలయాలు పోవాలంటే పచ్చిపాలలో దూది ముంచి తడి ఆరే కొద్దీ రాస్తుండాలి. ఇలా కొన్ని రోజులపాటు ఇలా చేస్తే వలయాలు కనిపించకుండా పోతాయి.