ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఫ్యాషన్ > ఫ్యాషన్ పరిశ్రమ భవిష్యత్తుకు డిజైనర్ల యత్నం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫ్యాషన్ పరిశ్రమ భవిష్యత్తుకు డిజైనర్ల యత్నం
ఫ్యాషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సంస్థ లక్ష్యాలు :

ఫ్యాషన్ పరిశ్రమ యొక్క ఫ్యాషన్, డిజైన్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్‌లను నిర్మించే వైపుగా ఫౌండేషన్ పనిచేయడం
ఫ్యాషన్ పరిశ్రమ అభివృద్ధి కార్యకలాపాలపై ఫౌండేషన్ దృష్టి సారించడం
భారత్‌ను ఒక డిజైన్ హబ్‌లా మార్కెటింగ్ చేయడం వైపుగా ఫౌండేషన్ పనిచేయడం

ఫ్యాషన్ పరిశ్రమ యొక్క ఫ్యాషన్, డిజైన్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్‌ను నిర్మించే దిశగా ఒక అపెక్స్ బాడీని నెలకొల్పినట్లుగా ప్రముఖ డిజైనర్లు గురువారం ప్రకటించారు. ఫ్యాషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పేరు గల ఈ అపెక్స్ బాడీ ఫ్యాషన్ పరిశ్రమను ప్రమోట్ చేసి, తదుపరి స్థాయికి తీసుకుపోయేందుకోసం బహుముఖ డిజైన్, ఫ్యాషన్ మరియు క్రాఫ్ట్ ప్రోత్సాహక చర్యలు చేపట్టనుంది.

FileFILE
డిజైన్ హబ్‌గా భారత్...!
  ప్రస్తుతం భారత్ ఫ్యాషన్ పరిశ్రమ ఎదుర్కొంటున్న స్థూల, సూక్ష్మ సమస్యలను ఈ ఫౌండేషన్ పరిష్కరిస్తుంది. భారత్‌ను డిజైన్ హబ్‌గా మార్కెటింగ్ చేయడం, జపాన్, న్యూయార్క్, బెల్జియం కోవలో భారత్‌ను నూతన భావజాల శక్తిగా ప్రోత్సహించడం దీని లక్ష్యాలు.      




మీరా ఆలీ, రోహిత్ బాలీ, తరుణ్ తహిలియానీ, అనామికా ఖన్నా, రాఘవేంద్ర రాథోర్, వరుణ్ షర్డానా, అభిజిత్ ఖన్నా, గౌరవ్ గుప్తా, హేమంత సాగర్, అట్సు శెఖోసె, అల్పానా & నీరజ, రాహుల్ రెడ్డి, ప్రియదర్శని రావ్, జాసన్ & అన్షు మరియు మాలిని రమణి మరియు ఇండస్ట్రీ ప్రొఫెషనల్ మరియు ఫ్యాషన్ సలహాదారు సుమీత్ నాయర్‌లు ఈ ఫౌండేషన్ సంస్థాపక సభ్యులు.

ఫ్యాషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యాత మీరా ఆలీ సంస్థ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తూ, భారత్‌లోనూ, విదేశాల్లోనూ ఫ్యాషన్ మరియు డిజైనింగ్ పరిశ్రమ పురోగతికి సాయపడేందుకోసం ఈ రెండు రంగాలలోని ప్రముఖులను ఒకచోటికి తీసుకు వచ్చే ఉద్దేశంతోటే ఈ ఫౌండేషన్‌ను ఏర్పర్చామని తెలిపారు.

కేవలం ఫ్యాషన్ ఈవెంట్లకే పరిమితి కాకుండా పరిశ్రమ ప్రయోజనాల కోసం అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆయా రంగాల్లో ఉత్తమ విధానాలను స్వీకరించడం, వ్యాపార పొత్తులను కుదర్చడం మరియు ఇతర ప్రోత్సాహక చర్యలను సంస్థ చేపడుతుందని మీరా చెప్పారు.

ఈ ఫౌండేషన్ అభివృద్ధి చర్యల్లో భాగంగా ఫ్యాషన్ పరిశ్రమ మూలాలను అభివృద్ధి చేయడం మరియు ఉత్పత్తి, టెక్నికల్ సామర్థ్యాలను పెంచుకోవడం, అభివృద్ధి మరియు క్రాఫ్ట్, క్రాఫ్ట్ ఆధారిత నైపుణ్యాలను పెంచుకోవడం, మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచుకోవడం, గ్రాంట్లు, రుణాలను అందజేయడం వంటి చర్యలను ఫౌండేషన్ చేపట్టనుంది. ఐపిఆర్, ఫైనాన్స్, రిటైల్, వాణిజ్యం, మార్కెటింగ్, జర్నలిజం తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సంస్థ అందించనుంది.
1 | 2  >>  
మరిన్ని
టెర్రరిస్ట్... ది డిఫరెంట్ షో రూమ్  
జనాకర్షక స్వాచ్ వాచీలకు పాతికేళ్ళు...!
తాజ్ కృష్ణలో 'వజ్రంతో ఆరోగ్యం' షో  
డిజైనర్లనే నివ్వెరపరచిన ప్రియాంక గాంధీ...!
బ్లాక్‌బెర్రీస్ నుంచి సరికొత్త వేసవి దుస్తుల కలెక్షన్
గోరింట పూసింది కొమ్మా లేకుండా....