గత వారాంతంలో ముంబై, ఢిల్లీ నగరాల్లో మేడిన్ ఇండియా ఫ్యాషన్ పోటీల్లో ఫిమేల్ సెలెబ్రిటీ మోడల్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రముఖ బాలీవుడ్ తార ఐశ్వర్యారాయ్ అవార్డు గెల్చుకున్నారు. పలువురు బాలీవుడ్ నటీనటులు, ప్రసిద్ధ డిజైనర్లు, ప్రముఖ మోడల్స్ సంబరంగా పాల్గొన్న ఈ ఫ్యాషన్ ఈవెంట్ వారాంతపు సందడి మజాను ఆహుతలకు చవి చూపించింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ గత వారాంతంలో ముంబై, ఢిల్లీ నగరాల్లో మేడిన్ ఇండియా ఫ్యాషన్ పేరిట జరిగిన ఫ్యాషన్ సంబరాలు ఆహుతులను అలరించాయి. విజ్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాషన్ ఇండియా సంస్థ ఈ సందర్భంగా ఎక్స్‌లెన్సీ ఫ్యాషన్ అవార్డులను బహుకరించింది. దీనికి ఫిరోజఖాన్, తుషార్ కపూర్, అర్జున్ రాంఫాల్, పాప్ గాయని ఎమ్మా బర్డన్, డిజైనర్లు జెజె వాలయా, రీతూకుమార్, సవ్యసాచి ముఖర్జీ, మోడల్స్ నీనా మాన్యూల్స్, విదిషా పవటే, జోయ్ మాథ్యూస్ వంటి వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఇక క్రికెటర్లు షోయబ్ అఖ్తర్, జహీర్ ఖాన్ చేసిన సందడి, సెలీనా జైట్లీ, జయేద్ ఖాన్, పూజా తదితరులు చేసిన నత్యాలు ఈ ఉత్సవానికి విచ్చేసిన వారిని ఊగించాయి. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారి వివరాలు.ఫిమేల్ సెలెబ్రిటీ మోడల్ ఆఫ్ ద ఇయర్ : ఐశ్వర్యారాయ్మేల్ సెలెబ్రిటీ మోడల్ ఆఫ్ ద ఇయర్ : షారుఖ్ ఖాన్మోస్ట్ ఫ్యాషనబుల్ మేల్ ఫిల్మ్ స్టార్ : అర్జున్ రాంఫాల్మోస్ట్ ఫ్యాషనబుల్ ఫిమేల్ ఫిల్మ్ స్టార్ : సుస్మితా సేన్ఫ్యాషన్ అంటే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాలి. భారతీయ ఆత్మను ఆవిష్కరించాలి. భారతీయ సంస్కృతికి అద్దంపట్టాలి. అది డిజైనర్లు, మోడల్స్‌ను మాత్రమే కాక సామాన్య నేతపనివారి సృజనాత్మకతను సైతం వెలికితీయాలి. ఇవన్నీ కలిపితే మేడిన్ ఇండియా ఫ్యాషన్ అవుతుంది. అలాంటి ఫ్యాషన్‌ను మొదటిసారి గుర్తించి, ఆదరించి, గౌరవించడం కోసం మేరీ కైర్ విదేశీ పత్రిక మొట్టమొదటి సారిగా మేడిన్ ఇండియా ఫ్యాషన్ అవార్డులను గత వారాంతంలో ప్రదానం చేసింది. భారతీయ వస్త్రాల సొబగును, వాటి వెనుక అద్బుతమైన పనితనాన్ని ఆవిష్కరించిన డిజైనర్లను సత్కరించింది. భారత్ నుంచి, భారత్ కోసం, భారతీయులు తయారు చేసిందేదైనా ఈ అవార్డులందుకోవడానికి అర్హమైనదే అని మేరీ కైర్ పత్రిక సంపాదకురాలిగా పనిచేస్తున్న షెఫాలీ వాసుదేవ్ చెప్పారు. గత వారాంతంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమానికి భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో చాలా మంది స్టార్లతో పాటు నటి టబు కూడా హాజరై ఆ సాయంసంధ్యలకు కొత్త వెలుగును తీసుకొచ్చారు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |