నెపోలియన్‌కి సంబంధించిన సుప్రసిద్ధ వాక్యాన్ని కాస్తంతగా మార్చి రాస్తే... ఆమె వచ్చింది, ర్యాంప్‌పై అలవోకగా అలా నడిచింది, వీక్షకుల హృదయాలను కొల్ల గొట్టింది.. ఢిల్లీలో ఈ వారం జరిగిన ఫ్యాషన్ వీక్ రెండో రోజు సుప్రసిద్ధ తార రైమా సేన్ స్టార్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. పర్యావరణం పరిరక్షణ పేరిట బెంగుళూరు డిజైనర్లు జాసన్, అన్షులు రూపొందించిన వినూత్న దుస్తులతో ర్యాంప్ పైకి వచ్చిన రైమా నిజంగానే ఆహుతులను పరవశింపజేసింది. ఎలెక్ట్రిక్ గ్రీన్ పేరిట ప్రకృతిని, సాంకేతికతను మేళవించి ఈ డిజైనర్ల ద్వయం రూపొందించిన దుస్తులు ధరించి క్యాట్‌వాక్ చేసిన రైమాసేన్ ఫ్యాషన్ షో రెండవరోజున ఆహుతులను కట్టిపడేసింది. పలు అనుబంధ వస్తువులతో కూడిన స్లీవ్ లెస్ గౌన్ ధరించి ర్యాంప్‌మీద మెరిసిన రైమా ఈ డిజైనర్ల థీమ్ నచ్చే తాను వాటిని ధరించడానికి అంగీకరించానని తెలిపింది. సాంప్రదాయిక రంగులు, సహజమైన టెక్చర్స్‌ను ఉపయోగించి వీరు విభిన్నమైన దుస్తుల కలెక్షన్ ఉపయోగించారని రైమా ప్రశంసించింది. వీరు రూపొందించిన దుస్తులలో చాలావరకు తనకు నచ్చాయని పేర్కొంది. ఈ సందర్భంగా డిజైనర్ జాసన్ మాట్లాడుతూ ప్రపంచం చాలావరకు వనరులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉందని, ప్రస్తుతం ఇంధన వనరుల అవసరం ఉందని చెప్పింది. ప్రకృతి సిద్ధ ఎనర్జీకి కళాత్మక పునఃనిర్ధారణ ఇవ్వడమే తమ కలెక్షన్ ప్రత్యేకత అని జాసన్ చెప్పారు. కాగా మంగళవారం నుంచి ఢిల్లీలో మొదలైన ఈ ఫ్యాషన్ వీక్‌లో రైమా సేన్‌తో సహా పలు సెలబ్రటీలు గ్లామర్ జిలుగులను ప్రదర్శించారు. సెలెబ్రిటీ కూడా మనిషేనని వారు మంచి డిజైన్‌ను ధరిస్తే అది చాలా బాగుంటుందని అన్షు తెలిపారు. సహజసిద్ధమైన రంగులలో రిబ్బన్ మరియు స్టాకింగ్‌ను ఉపయోగించడంతో తమ కలెక్షన్ చక్కగా అలరించిందని అన్షు చెప్పారు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |