ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఫ్యాషన్ > చీరలో ఇండియా యువరాణిలా వెలిగా: విక్టోరియా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చీరలో ఇండియా యువరాణిలా వెలిగా: విక్టోరియా
FILE
సుప్రసిద్ధ ఫ్యాషన్ మ్యాగజైన్ అయిన ఓగ్ ఇండియా కవర్ పేజీ కోసం ఇటీవలే శారీలో ఫోజ్ ఇచ్చి మతి పొగొట్టిన సుప్రసిద్థ గాయని, ఇంగ్లండ్ సాకర్ హీరో బెక్‌హామ్ సతీమణి అయిన విక్టోరియా ఆ చీరకట్టులో తాను భారత యువరాణిలా వెలిగి పోయానని గారాలు పోయింది.

నారింజ రంగు చీర, పెద్ద హెడ్ పీస్‌‌తో వోగ్ పత్రిక కవర్ పేజీపై దర్శనమిచ్చిన పోష్ -విక్టోరియా- ఆ చీరకట్టు అందానికి పూర్తిగా దాసోహమైపోయింది. భవిష్యత్తులో సైతం అలాంటి చీర ధరించడానికి పోష్ ఇప్పుడు తెగ ఉత్సాహ పడిపోతోంది మరి.
చీరలో సెలెబ్రిటీలు...
  భారతీయ చీర ఆధునిక పోకడలు పోతుందో లేక విదేశీ మహిళా సెలెబ్రిటీల ఆలోచనలు ప్రాచ్య ఆధునికతవైపు మొగ్గు చూపుతున్నాయో తెలీదు గాని భారతీయ చీరకట్టు విదేశీ వనితలను విపరీతంగా ఆకరిస్తోంది. వోగ్ పత్రిక దాన్ని సరిగ్గానే పట్టుకున్నట్లుంది.      


మాజీ స్పైస్ గర్ల్ విక్టోరియా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక డిజైనర్‌గా ఇలాంటి దుస్తులను ధరించడం తానెంతో ఇష్టపడతానని చెప్పారు. ఈ చీరకట్టులో నిజమైన పనితన దాగి ఉందని ఆమె ప్రశంసించారు. ఈ చీర నేయడంలో అసాధారణ నైపుణ్యం చూపించారని కొనియాడారు.

నిజం చెప్పాలంటే ఆ చీరలో తన్ను తాను ఒక ఇండియా యువరాణిలా భావించుకున్నానని పోష్ చెప్పింది. అద్భుతమైన పనితనంతో తను ధరించిన దుస్తులు అలరారినట్లుగా ఆమె కొనియాడారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కాళ్లను నేల మీంచి లేపని విక్టోరియా తన నమ్రతా వైఖరికి గాను వోగ్ సంపాదక బృందంలో సభ్యురాలిగా కూడా ఉంది.

విక్టోరియా తన చీర కట్టు అందానికి తానే పడి పోయిందని తలుస్తున్నట్లుగా పత్రిక ఫ్యాషన్ ఫీచర్స్ డైరెక్టర్ బందనా తీవారి చెప్పారు. ఉన్నట్లుండి విక్టోరియా భారతీయ చీరకట్టులో దర్శనమిచ్చి సెన్స్ ఆప్ హ్యూమర్‌ను ప్రదర్శించిందని, ఈ చలికాలంలో బ్రిటన్ మహిళలు చాలామంది విక్టోరియా ప్రభావంతో చీరకట్టుకోసం ఎగబడినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆమె అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రియాంక చోప్రా చిందులు
జీన్స్‌పై తరగని యువతుల మోజు
సెక్సీయెస్ట్ "నయన" సుందరిగా ఐశ్వర్య
ఢిల్లీ ఫ్యాషన్ వీక్‌లో రైమా సేన్ మెరుపులు
మేడిన్ ఇండియా సెలబ్రిటీగా ఐశ్వర్యారాయ్
త్వరలో కరీనా కపూర్ స్వంత ఫ్యాషన్ పోర్టల్