ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఫ్యాషన్ > భారతీయ మహిళా డిజైనర్లు అతి సమర్థులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారతీయ మహిళా డిజైనర్లు అతి సమర్థులు
FILE
భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు తమ సృజనాత్మక కల్పన ద్వారా స్థానిక సంస్కృతికి ప్రపంచ స్థాయి అప్పీల్‌ని కల్పించడంలో ఇటీవలకాలంలో ప్రతిభా సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారని సుప్రసిద్ధ రష్యన్ డిజైనర్ వ్యాచెస్లావ్ జైట్సెవ్ ప్రశంసించారు. భారతీయ ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.

తన శీతాకాల దుస్తుల కలెక్షన్ ప్రమోట్ చేసుకోవడానికి భారత్ విచ్చేసిన జైట్సేవ్, భారతీయ ఫ్యాషన్ డిజైనర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. పశ్చిమ దేశాల్లో వీరికి జనాదరణ అత్యధికంగా ఉంటోందని తెలిపారు. భారతీయ దుస్తుల డిజైనర్లు తమ దుస్తుల కలెక్షన్ ద్వారా స్థానిక సంస్కృతిని పశ్చిమ దేశాల్లో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారని కొనియాడారు.
మహిళా డిజైనర్ల మెరుపులు..
  మొత్తంమీద భారతీయ మహిళా డిజైనర్లకు విదేశీ గుర్తింపు లభిస్తున్నట్లే కనిపిస్తోంది. విక్టోరియా బెక్‌హామ్ లాంటి విదేశీ సెలబ్రిటీలు సైతం ఇటీవలే ఫ్యాషన్ పత్రికలలో భారతీయ చీరకట్టుతో కనువిందు చేయడం తెలిసిందే. దేశీయ చీరె విదేశీ సొగసులు అద్దుకుంటోంది మరి...      


ప్రత్యేకించి భారతీయ మహిళా డిజైనర్లు ప్రత్యేకించి అత్యున్నత ప్రతిభావంతులని జైట్సేవ్ ప్రశంసించారు. "రష్యాలో భారతీయ సంవత్సరం 2009" ప్రదర్శన సందర్బంగా తాను భారతీయ డిజైనర్లతో కలిసి పని చేయనున్నట్లుగా జై్ట్సేవ్ చెప్పారు. రష్యాలో భారతీయ ఫ్యాషన్ డిజైనర్లతో కలిసి ఫ్యాషన్ షోలను కూడా తాను నిర్వహిస్తానని పేర్కొన్నారు.

భారతీయ మోడల్స్‌తో కలిసి పనిచేయడం పట్ల తనకెంతో ఆసక్తిగా ఉందని చెప్పారు. భారతీయ మోడల్స్ జగదేకసుందరీమణులని కొనియాడిన జైట్సేవ్ వారితో తాను తప్పక కలిసి పనిచేయనున్నట్లుగా తెలిపారు. భారతీయ దుస్తులలో తనకు నచ్చిందేది అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు భారతీయ చీరె సౌందర్యం తనను కట్టిపడేస్తుందని రష్యా డిజైనర్ పేర్కొన్నారు.

తాజమహల్ వెలుపల కొంతమంది భారతీయ మహిళలు కూర్చుని ఉండటం చూశానని, చీరకట్టులో వారు చాలా బాగున్నారని చెప్పారు. చీరతో అలంకరించడం చాలా కష్టమేనని అయితే భారతీయ, రష్యన్ దుస్తులను మేళవించి ఫ్యాషన్ డిజైన్ చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు.

అయితే భారతీయ ఫ్యాషన్ ప్రపంచం గురించి చాలామంది రష్యన్లకు తెలియకపోవడం విచారకరమని జైట్సేవ్ పేర్కొన్నారు. మహిళలు జీన్స్, ప్యాంట్లు ధరించడానికి తాను వ్యతిరేకమని చెప్పారు. నేటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులను అధిగమిస్తున్నారని, కాబట్టి వారు జీన్స్‌ను, ప్యాంట్లను అయినా పురుషులకు వదలివేయాలని అభిప్రాయపడ్డారు. తమ సాంప్రదాయిక దుస్తులలోనే మహిళలు చక్కగా కనిపిస్తారని చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లైంగిక వేధింపు కేసులో భారత్ డిజైనర్‌కు శిక్ష
రష్యన్ ఫ్యాషన్ డిజైనర్‌కు భారత్‌పై మోజు
మిషెల్ ఒబామాలా డ్రస్ చేసుకుంటే...
ఫెమిల్లా ఫ్యాషన్స్‌చే వింటర్ కలెక్షన్
పాక్‌లో భారతీయ చీరలు, నగల ప్రదర్శన
చీరలో ఇండియా యువరాణిలా వెలిగా: విక్టోరియా