ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఫ్యాషన్ > కొత్త సంవత్సరానికి 'యువతుల' స్వాగతం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొత్త సంవత్సరానికి 'యువతుల' స్వాగతం
FileFILE
'వినాశకాలే.. విపరీత బుద్ధి' అనే నానుడి కొందరు యువతీయువకులు చేసే చేష్టలకు సరిగ్గా నప్పుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా శుభకార్యమో, పండుగలు వస్తే వీరు చేసే వెకిలి చేష్టలు అంతాఇంతా కాదు. ప్రాశ్చాత్య సంస్కృతి, ఫ్యాషన్‌ మత్తులో మునిగి తేలుతున్న యువతీయువకులు తదనుగుణంగానే నడుచుకుంటూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఈ ఫ్యాషన్ వెర్రిలో కేవలం యువకులే కాకుండా.. యువతులు సైతం పోటీ పడుతున్నారు. ముప్పావు శరీరాన్ని ప్రదర్శించేటటువంటి దుస్తులు వేసుకోవడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.

అలాగే తమ జుత్తు (వెంట్రుకలు)కు రంగులు వేసుకోవడం, శరీరంపై టూటూలు (పచ్చబొట్లు) వేయించుకోవడంలోనూ అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో కొంతమంది యువతులు తమ వీపుపై కొత్త సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పచ్చబొట్లు, పెయింటింగ్స్ వేసుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఈ ప్రదర్శన వీపు పై వరకే ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్రదర్శన శృతి మించి మరింత కిందికి జారిపోతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నీళ్లలో వేస్తే కరిగిపోయే ప్లాస్టిక్ దుస్తులు
మిస్ వరల్డ్ కిరీటం పార్వతికి దక్కేనా...!
భర్తలకంటే బట్టలపైనే మగువలకు మక్కువట..
ఇక వివాహిత మహిళల బ్యూటీ పెరేడ్
లాంగిన్స్ అడ్మిరల్ వాచీల షోలో ఐశ్వర్య
భారతీయ మహిళా డిజైనర్లు అతి సమర్థులు