ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఫ్యాషన్ > భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ - 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ - 2008
FILE
ఆర్థిక సంక్షోభపు ప్రకంపనలు బలంగా తాకుతున్నప్పటికీ భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ 2008లో ఓ వెలుగు వెలిగిందనే చెప్పాలి. గత సంవత్సరం భారతీయ ఫ్యాషన్ పరిశ్రమ రెండుగా చీలిపోయి వివాదాలు రేకెత్తించింది. ఎన్నడూ లేనంత స్థాయిలో సినీ తారలు ర్యాంప్‌పై పిల్లినడకలతో అలరించగా, ఫ్యాషన్ సంస్థలు అనేక ప్రయోగాలు చేశాయి.

2008లో భారత్‌లో నిర్వహించిన పలు ఫ్యాషన్ కార్యక్రమాల్లో విదేశీ కొనుగోలుదారులు పాల్గొని భారతీయ డిజైన్ల పట్ల చక్కటి ఆసక్తి కనపర్చారు. భారతీయ డిజైనర్లు వీరి పుణ్యమా అని తమ వ్యాపారాన్ని బాగా పెంచుకోగలిగారు. కొంత మంది భారతీయులు గత సంవత్సరం అంతర్జాతీయ గుర్తింపు పొందారు కూడా.

దీంతో గ్లోబల్ మార్కెట్లో భారతీయ ఫ్యాషన్‌కు జనాదరణ లభించిందనే చెప్పాలి. 2008లో ప్రపంచ ఫ్యాషన్ రంగంలో జరిగిన కీలక పరిణామాలను గమనిస్తే వీటిలో భారతీయుల పాత్ర కొట్టొచ్చినట్లు కనబడుతుంది.

మిస్ వరల్డ్ 2008
రష్యా అందాల సుందరి సెన్యా సుఖినోవా డజన్ల కొద్దీ ప్రపంచ సుందరీమణులను త్రోసి రాజని 2008 మిస్ వరల్డ్ కిరీటాన్ని చేజిక్కించుకుంది. ఈ పోటీలో చివరి వరకూ ఆశలు రేపిన మిస్ ఇండియా పార్వతీ ఓమనకుట్టాన్ తొలి రన్నర్‌గా నిలిచి దేశ ప్రతిష్టను నిలిపింది.

దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్‌లో జరిపిన మిస్ వరల్డ్ పోటీలో విజయం అంచులదాకా వచ్చిన పార్వతి తృటిలో పతకాన్ని రష్యన్ సుందరికి జారవిడిచింది. 2008 ప్రపంచ సుందరి పోటీల్లో వందకు పైగా ప్రపంచ సుందరులు దక్షిణాఫ్రికాలో పోటీలు నిర్వహించిన వేదికపై తమ హొయలు చూపించారు.

ఈ పోటీల్లో కేరళ తీరప్రాంతంనుంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని వచ్చిన పార్వతీ ఓమనకుట్టాన్ ప్రపంచ సుందరి పోటీల్లో తొలి రన్నరప్‌గా వచ్చి ఆహూతులను అలరించింది. గత సంవత్సరం ఏప్రిల్ 6న ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో అగ్రస్థానం పొందిన పార్వతి అప్పటినుంచి ప్రపంచ సుందరి పోటీలకు విశేషంగా కృషి చేసింది.

చివరకు నీలికళ్ల రష్యా సుందరి సెనియా సుఖినోవా చేతిలో పరాజయం పొంది రన్నరప్‌గా నిలిచినప్పటికీ ప్రపంచసుందరి పోటీల యవనికపై తన ఆత్మవిశ్వాస ప్రకటనతో, హోయలుతో అందరినీ అలరించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రియుడి జీన్స్‌లో ఉంది మజా....
కొత్త సంవత్సరానికి 'యువతుల' స్వాగతం
నీళ్లలో వేస్తే కరిగిపోయే ప్లాస్టిక్ దుస్తులు
మిస్ వరల్డ్ కిరీటం పార్వతికి దక్కేనా...!
భర్తలకంటే బట్టలపైనే మగువలకు మక్కువట..
ఇక వివాహిత మహిళల బ్యూటీ పెరేడ్