ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » ఫ్యాషన్ » మీ ముఖానికి సరైన జోడు... (spectacle selection | Round face | Rectangular face)
 
WD
కళ్ళజోడు ధరించేవారు ఎలాంటిది కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటి అంశం ఏమిటంటే.. ఆ కళ్ళజోడు బాగా కనిపించేదిగా ఉండాలి. రెండో అంశం.. కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల అందం పెరగాలి గానీ తగ్గిపోకూడదు. ఇక మూడో అంశం.. ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించి కళ్ళజోడును ఎంపిక చేసుకోవాలి. దీనితోపాటు మీ ముఖాకృతిని బట్టి సెలక్షన్ ఉండాలి.

గుండ్రటి ముఖం: బాగా గుండ్రంగా ఉన్న ముఖం సన్నగా, పొడవుగా కనబడాలంటే మొనతేలిన వెడల్పు తక్కువ ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడును ధరించాలి .

కోల ముఖం: చక్కటి ముఖమంటే కోలముఖమే అంటారు కదా. ఈ ముఖం ఉన్నవాళ్లు ఎలాంటి ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడునైనా పెట్టుకోవచ్చు. అయితే వీరు కోలగా ఉన్న ఫ్రేమును వాడకపోవడమే మంచిది.

దీర్ఘచతురస్రాకారపు ముఖం: ఇలాంటి ముఖం ఉన్నవారు చిన్నగా మరింత, చక్కగా కనబడాలంటే దీర్ఘచతురస్ర లేదా చదరపు ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడును ఎంచుకోవాలి.

చదరపు ముఖం: ఇటువంటి ముఖాకృతి కలవారు తమ ముఖం పొడవుగా కనబడాలంటే వెడల్పు తక్కువ, కోలగా చిన్నగా ఉన్న ఫ్రేమ్ కళ్ళజోడును ధరించాలి.

వజ్రాకృతి: వజ్రాకృతి ఆకారంలో ముఖాన్ని కలిగి ఉండేవారు చాలా అరుదు. వీరికి రిమ్‌లెస్ ఫ్రేములు, లేదా కోలగా ఉండే ఫ్రేములు బావుంటాయి.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.