ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్ దృష్టి అంతా బాహుమూలలు, తొడలు, వక్షోజాల ఆకృతిలపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటోంది. ఫ్యాషన్ ప్రపంచం భవిష్యత్ ట్రెండ్ ఎలా ఉండబోతుందన్నది ఈ అంశాలపైనే ఆధారపడి నేటి ఫ్యాషన్ డిజైనర్లు తమ తమ మెదళ్లకు పని చెపుతున్నారు. ఫ్యాషన్ షోలంటే చాలు... వ్యాపార వర్గాల మాటేమోగానీ, టీనేజ్ యువతీయువకులు మాత్రం ఎగబడి వెళుతుంటారు. అందుక్కారణాలు చాలానే ఉంటాయనుకోండి.