జుట్టంతా మౌస్సైరాసి, చిన్న చిన్న పాయలుగా విడదీసి, జుట్టు ట్విస్ట్ చేయాలి. ప్రతి సెక్షన్‌కు క్లిప్పెట్టి డిప్యూజర్తో డ్రై చేయాలి. రోలర్ సెట్ చేయవచ్చు కానీ దీనికి ప్రాక్టీస్ కావాలి. పొడిజుట్టుపై హీటెడ్ రోలర్స్ ఉపయోగించినట్లయితే ప్రతి విభాగానికీ రోలర్ వాడే ముందు లైట్ కంట్రోల్ హెయిర్ స్ప్రే వాడాలి. జుట్టును నిలువుగా రెండు భాగాలుగా విభజించాలి. మౌస్సై లేదా ఉంగరాలు తిప్పేందుకు వీలైన ఉత్పత్తుల్ని అప్లయ్ చేయాలి. ప్రతి విభాగాన్ని తీసుకుని పూర్తి శిరోజాల్ని నడినెత్తి వైపునకు రోల్ చేయాలి.