ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గృహాలంకరణలో మెట్ల అందం
గృహాలంకరణలో మెట్ల అందాన్ని ఇనుమడింపజేయడానికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే ఇళ్లు మరింత రమ్యంగా... ఆహ్లాదపరిచే విధంగా కనిపిస్తుంది. ఇందుకు కొన్ని రకాలైన పద్ధతులున్నాయి. మెట్టు మెట్టుకి విభిన్న తరహా స్టైల్, లైట్లు వంటివి మెట్లకు మరింత ఆకర్షణీయంగా కనపడుతాయి.

గృహానికి లోపల మెట్లు కట్టేందుకు వాడే సామగ్రిని బట్టి... అంటే నిటారుగా, వంపుగా గల మెట్లను ఫ్లోరింగ్‌కు తగినట్లు అలంకరించుకుంటే అతిధుల కళ్లకు చక్కగా ఉన్నట్లు ఉంటుంది. వంపుగా కట్టే స్టెయిర్ కేసును చూస్తే వాటి యందు ఏదో మిస్టరీ దాగినట్లు అనిపిస్తుంది. వీటిని కార్పెట్‌తో అలంకరించి లైట్లను జోడిస్తే చూపరులకు మహదానందంగా ఉంటుంది.

అలాగే గృహంలో స్టెయిర్ కేసుకు ఒకవైపు మాత్రమే గోడ ఉన్నట్లయితే పెయింటింగ్స్‌ను అతికించండి.. లేదు రెండు వైపులా గోడ ఉన్నట్లయితే మాత్రం క్లోజప్‌లో ఉండే స్టిక్కర్లనుగాని, ప్లాస్టరింగ్ చేయని ఇటుకలను గాని పేర్చుకుంటే సింపుల్‌గా ఉంటుంది. అలా కాకుండా గుళకరాళ్లుగా కనపడే గోడ అయినా గాని బాగుంటుంది.
మరిన్ని
పింగాణీతో ఫ్లవర్‌వాజ్ తయారీ..
చెప్పుల బాక్సులను పడేయకుండా...
కళాత్మక దృష్టితో కార్నర్స్‌కు కాంతులు..
పాత వస్తువులను ఉపయోగించే విధానం
వంటగది శుభ్రతకు కొన్ని చిట్కాలు
కాఫీ కప్పుతో ఫ్లవర్ వాజ్ తయారీ