గృహంలో కేవలం నిద్రించేందుకు వాడేదే బెడ్‌రూం అనుకోకుండా, ఆందోళనలను తగ్గించి మనస్సుకు శాంతి అందించేదే బెడ్‌రూం. బెడ్‌రూ కాస్త చిన్నదిగా ఉన్నప్పటికీ ఆహ్లాదకరమైన లేతరంగులు వేయడం ద్వారా విశాలంగా కనిపిస్తుంది. దానికి తగిన పరదాలు.. కర్టెన్లు ఎంచుకోవడం కూడా అవసరమే.
గదిలో లైట్లు, ఫ్యాన్లు, తదితరాల స్విచ్‌లు మంచం పక్కన కూడా అందుబాటులో ఉండాలి. మంచం పక్కనే కాళ్లు తుడుచుకునే మ్యాట్ తప్పనిసరి. నిద్రపోయేముందోసారి కాళ్లు తుడుచుకోవాలి. మంచం దగ్గరే కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలనుకునేవారు... ఇందుకోసం ప్రత్యేకించి చేసే స్టూల్‌ను కొనుక్కోండి. అనారోగ్యంగా ఉన్నప్పుడు మంచంపై కూర్చుని భోజనమూ చేయవచ్చు. మందులు, మంచినీళ్లు కూడా పెట్టుకోవచ్చు.
బెడ్‌రూంలోనే బీరువాలన్నీ సర్దుకునే ధోరణి మారాలి. గోడలకే కప్ బోర్డులు ఏర్పాటు చేసుకుంటే సరే... అలా కాకుండా విడిగా ఉండే బీరువాలతో నింపేస్తే గందరగోళంగా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ లైటు ఉండేలా ప్లాన్ చేసుకోవడం తప్పనిసరి. అద్దం మీదనే లైటు ఉంటే వెలుతురు బాగుంటుంది. మేకప్ చేసుకుంటున్నప్పుడు చిన్న చిన్న లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి.
మీరు ప్రతి రోజు నిద్రలేచి కళ్ళు తెరవగానే కనిపించేలా గోడకు ఆహ్లాదకరమైన వాల్‌పోస్టర్ కానీ, పెయింటింగ్‌నుకానీ అమర్చండి. కాలింగ్ బెల్‌ను కూడా బెడ్ పక్కనే ఏర్పాటు చేసుకుంటే అత్యవసరమైనపుడు వాడుకోవచ్చు.
|