గృహాలంకరణలో ద్వార అమరిక ముఖ్యమైన పాత్ర వహిస్తోంది. అంతేకాకుండా ద్వార అలంకరణ ఇంటికే ప్రత్యేక అందాన్నిస్తుందనే సంగతి తెలిసిందే. అనేక మంది గృహిణులు ఇంటి అలంకరణలో ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ఇందులో వారి వారి ఇష్టానుసారం సృజనాత్మక నైపుణ్యంతో గృహాన్ని అలంకరించుకుంటారు.
ఇలాంటి వారికోసం కొన్ని సింహద్వార అలంకరణ చిట్కాలు... సింహద్వారంలో మీకు నచ్చిన ఇష్టదైవ పటాలను చిన్న చిన్న తోరణాలతో అలంకరించుకుంటే ఇంటికి ఆకర్షణనిస్తుంది. అంతేకాకుండా ఏదేని పార్టీల సమయాల్లో అతిథులను ఆకర్షించే విధంగా సువాసనలు వెదజల్లే రకరకాలైన పువ్వులతో అలంకరించుకుంటే ప్రత్యేక అందాన్నిస్తుంది.
సింహద్వారం దాలబంద్రానికి అందమైన పెంటింగ్ చేయడం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. తలుపులకు ఇరువైపులా తాళంను బిగించుకోవడం మంచిది. సింహద్వారంపై దుమ్ము దూళి చేరకుండా ఎప్పటికప్పుడు తడి బట్టతో శుభ్రం చేసుకోవాలి. సింహద్వారానికి వేసే పెయింటిగ్ లేత రంగులో ఉండటం వలను చుసేందుకు అందంగా కనిపిస్తుంది.
|