ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సాన్నిహిత్యానికి భరోసా ఇచ్చే ఫర్నిచర్ సోఫా
హాలులో టీవీ చూసే సమయంలో కానీ, పుస్తకం చదువుకునే సందర్భంలో కానీ నడుం వాల్చడానికి వీలుగా ఉండేదే ఫర్నిచర్ సోఫా. దీనికి మారుపేరు లవ్ సీటు. ఆలుమగలు కాని, ఇద్దరు స్నేహితులు కాని, అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్లు ఎవరైనా ఇద్దరు కూర్చునేందుకు వీలుగా ఉండే సోఫానే లవ్ సీటు అంటారు. ఇవి సినిమా హాళ్లు, ఫంక్షన్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, స్టార్ హోటల్స్ వంటి అన్ని చోట్లా ఉంటాయి.

లవ్ సీటుకు ఉన్న సౌకర్యం ఏమిటంటే ఇది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి అనువుగా ఉంటుంది. తమకు ఇష్టమైన వారి పక్కన దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి ఎవరైనా ముందుకు వస్తారు. పెద్ద పెద్ద సోఫాలు, దివాన్లతో ఇంటిని నింపకుండా రెండు మూడు సీట్లను కొని హాల్లో రెండు, బెడ్ రూమ్‌లో ఒకటి వేస్తే ఇష్టమైన వారి పక్కన మరొకరు కూర్చోకుండా తామే కూర్చోవడానికి వీలుగా ఉంటుంది.

సుఖంగా, ఏకాంతంగా ఉండే ఒక మూల లవ్ సీటును వేసుకుంటే ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇంటి నిండా జన సమూహం ఉన్నా సరదాగా కబుర్లు చెప్పుకోడానికయినా, కలిసి కూర్చుని కాఫీ తాగాలనిపించినా, లవ్ సీటులో కూర్చుంటే చాలు మరొకరు మీరున్న చోటికి రావడానికి సాహసించరంటే అతిశయోక్తి కానేరదు కదా..

అందరూ నడిచే దారిలో గుమ్మాలకు దగ్గరగా లవ్ సీటును అమర్చకుండా ఉంటే బాగుంటుంది. చిన్న చిన్న ఇళ్లలో నివసించే వారు సైతం లవ్ సీట్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే దాన్ని అమర్చడానికి ఎక్కువ స్థలం అవసరం ఉండదు. మోడ్రన్ లవ్ సీట్ అయితే 53 నుంచి 60 అంగుళాల వెడల్పు, 34 నుంచి 38 అంగుళాల ఎత్తులో, 34-38 అంగుళాల లోతులో ఉంటాయి.

కొనేముందు జాగ్రత్తలు...
లవ్ సీట్ కొనటానికి ముందు దాంట్లో కూర్చుని సదుపాయంగా ఉందో లేదో పరిశీలించుకోవాలి. దాన్ని రాత్రి పూట చిన్న సైజు బెడ్‌గా కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేది లేనిదీ చూసే కొనాలి. అలాగే లెదర్‌తో చేసిన లవ్ సీట్ కావాలో కొయ్యతో చేసిన ఫర్నిచర్ సోపా కావాలో ముందే నిర్ధారించుకుని కొనాలి.

లవ్ సీట్ కొని తెచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని గతించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే జీవితంలో ఏం కోల్పోయారో అర్థమవుతుంది.

కాబట్టి లవ్ సీట్ అనే ఈ ఫర్నీచర్ సోఫాను కొనడం మర్చిపోకండేం....
మరిన్ని
గృహసౌందర్యన్ని ఇనుమడింపజేసే హాలు
కర్టెన్లతో గృహ సౌందర్యం
వాల్‌ పోస్టర్లతో గృహాలంకరణ
గృహాలంకరణకు సువాసనలు వెదజల్లే పుష్పాలు
గృహ అలంకరణలో సింహద్వారం
అన్నిటికీ అనువైన బెడ్‌రూం