ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వేసవిలో గృహ సౌందర్యం
సెలవుల సమయం వచ్చేసింది కదా. పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు. ఊళ్ల నుంచి బంధువులు, చుట్టాలు వస్తుంటారు, మరి ఈ సమయంలో మీ ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుకునేందుకు మీరెలా ప్లాన్ చేసుకున్నారు? అయితే ఇంటికి వచ్చే అతిథులను ఆకట్టుకునేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం... అయితే అతిథులు ఇంటికి రావడానికి ఓ వారం ముందే వీటిపై శ్రద్ధ చూపాలి.

గోడకున్న పెయింటిగ్స్ పాతవైపోతే వాటిని మీ అభిరుచికి తగ్గట్టు, వేసవికి తగినట్లుగా మార్చుకోండి. వానాకాలనికి సరిపోయేలా మీరు లేత రంగుల కర్టెన్లను ఉపయోగించి ఉంటే వేసవికి తగ్గట్టుగా ముదురు రంగుల కర్టెన్లకు మారిపోండి. అప్పుడు వేడి, అధిక వెలుతురు ఇంటిలోకి రాకుండా చల్లగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో తలుపులన్నీ తెరచి బయటి గాలిని లోపలకి రానివ్వాలి. సహజమైన గాలి లోపలికి రావడం ద్వారా ఇంటికి కొంత కాంతి వచ్చినట్టవుతుంది.

పల్చని కాటన్ దుప్పట్లను మంచంపై పరవడం ద్వారా మన చర్మానికి వేడి తాకిడి లేకుండా ఇవి కాపాడతాయి. వెచ్చగా ఉండేందుకు వానాకాలంలో వాడిన దట్టమైన కార్పెట్లను తీసి వాటి స్థానంలో చల్లగా ఉండే కార్పెట్లను అమర్చాలి. అలాగే బాల్కనీలలో ఉన్న మొక్కలను తీసి కొత్తగా చిగురు వస్తున్న మొక్కలను పెట్టండి. ఇలా మారుస్తూ ఉంటే ఇంటికి కొత్తదనం వస్తుంది.

అలా తీసిన మొక్కలను మరో చోట అందంగా అమర్చుకోండి. అందమైన పూల మొక్కలు మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడంతో పాటు ఇంటికి అందాన్ని కూడా ఇస్తాయి. వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూలర్‌లు, ఏసీలను మీకు కావలసిన గదులలో అంటే బెడ్‌రూం, ఆఫీసు రూంలలో అమర్చుకోండి. కూలర్లపైన అందమైన పచ్చని చెట్లను అమర్చుకుంటే చల్లనిగాలి చెట్ల నుంచి వచ్చే సహజమైన గాలి మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది.
మరిన్ని
వంటిళ్ల రూపకల్పన ప్రస్తుతం ఓ కళ...
సాన్నిహిత్యానికి భరోసా ఇచ్చే ఫర్నిచర్ సోఫా
గృహసౌందర్యన్ని ఇనుమడింపజేసే హాలు
కర్టెన్లతో గృహ సౌందర్యం
వాల్‌ పోస్టర్లతో గృహాలంకరణ
గృహాలంకరణకు సువాసనలు వెదజల్లే పుష్పాలు