గృహ శోభను ద్విగుణీకృతం చేసే అందమైన బొమ్మలను తమతమ ఇళ్లలో అలంకరించుకోవాలనేవారికి ఇదో చక్కని అవకాశం. హైదరాబాదులోని తార్నాకలో లేపాక్షి హస్త కళల రూపాలైన రకరకాల ముద్దులొలికే బొమ్మలతోపాటు ఆధ్యాత్మికత ఉట్టిపడే చందనపు బొమ్మలు, ప్రకృతి రమణీయతను అద్దంపట్టే పక్షుల బొమ్మలు, నాటి ఆచార వ్యవహారాలను తెలియజేసే మానవ ఆకృతులను ప్రదర్శిస్తోంది.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హస్త కళా రూపాలతోపాటు... మన రాష్ట్రంలోని మంగళగిరి, నిర్మల్, కాళహస్తి పెయింటిగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ సుందర రూపాలను మీ ఇంటిలో అలంకరించుకుని ఆహ్లాదంగా తీర్చిదిద్దుకోవటం మీ వంతు... ఈ వీడియోను ఒకసారి వీక్షించండి.
|