గతంలో కొత్తగా కట్టిన ఇళ్లకు గానీ, రంగులు వెలసిపోయిన ఇళ్లకుగానీ ముదురురంగులు వేయించేందుకు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. లేత రంగులను మాత్రం ఇష్టపడేవారు, వాటినే ఎక్కువగా వాడేవారు. కానీ... ప్రస్తుతం ఆ ట్రెండ్ మారిపోయింది. అంతేకాదు ముదురురంగులు వాడటం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.ముదురు రంగులు గదిని తేజోవంతంగా ఉంచుతాయి. పెద్ద గదులకు ఇలాంటి రంగులే బాగా సరిపోతాయి. ఇకపోతే మార్కెట్లో దొరికే ముదురురంగులతో ఇళ్లకు పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. ఈ పెయింటింగ్‌లో కూడా షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి తగిన ప్రాముఖ్యం ఉంటుంది. | | ఎరుపు, పసుపు రంగులు కంటికి నిండుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు ఉండే ఈ రంగులు ఉత్సాహాన్ని నింపడమేగాక, ప్రశాంత వాతావరణాన్ని కలుగ జేస్తాయి. అయితే, వీటిని ఎంపిక చేసుకునే ముందు కొంత జాగ్రత్తగా ఉండి మరీ గాడీగా ఉండేవి కాకుండా సాఫ్ట్‌గా ఉండేవి తీసుకుంటే... |
| |
పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నప్పటికీ... వేరే రంగుతో కలిసినప్పుడు అవి విభిన్నంగా కనిపిస్తాయి. ఆ రంగుల కథాకమీషేంటో చూద్దామా....!ఎరుపు, పసుపు రంగులు కంటికి నిండుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు ఉండే ఈ రంగులు ఉత్సాహాన్ని నింపడమేగాక, ప్రశాంత వాతావరణాన్ని కలుగ జేస్తాయి. అయితే, వీటిని ఎంపిక చేసుకునే ముందు కొంత జాగ్రత్తగా ఉండి మరీ గాడీగా ఉండేవి కాకుండా సాఫ్ట్‌గా ఉండేవి తీసుకుంటే మంచిది.ఇకపోతే.... పౌడర్ పింక్, బేబీ బ్లూ, సాఫ్ట్ గ్రీన్‌లు చూడగానే కంటికి హాయిగా అనిపిస్తాయి. ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ ఈ రంగుల వల్ల మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. అయితే... ఈ రంగులను సూర్యకాంతి పడకుండా, కరెంట్ ద్వారా మాత్రమే వెలుగు వచ్చే గదుల్లో అసలు వాడకూడదు. |