ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > పుష్పాలంకరణలో సరి కొత్త రీతులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పుష్పాలంకరణలో సరి కొత్త రీతులు
FILE
ఇంట్లో పూలను రకరకాల కుండీల్లో ఉంచి అమర్చుకోవడం వల్ల ఇంటికి ఎంతో ఆకర్షణ వస్తుంది. మొక్కల కుండీలను ఇళ్లలో ఉంటి కింద, వైన వేలాడదీస్తున్న చందాన పూల కుండీలను కూడా పలురకాల డెకరేషన్‌లతో ఉంచితే ఇల్లు పొందికగా ఉంటుంది. కలర్‌పుల్ పవర్ డెకరేషన్‌కు కలర్‌రపుల్ ప్లవర్ పాట్‌లు కూడా అవసరమని చెప్పనక్కరలేదు కదా.

పొడవాటి పూలను ఎత్తుగా అలంకరించాలంటే వెడల్పుగా, ఎత్తు తక్కువగా ఉన్న బాటిల్ లేదా కుదురు లాంటివి తీసుకోవాలి. బాటిల్ లేదా కుదురులో పావు వంతు నీరు పోసి, రంగు రాళ్లను, గోళీలను అందులో అందంగా అమర్చాలి.

బాటిల్ అడుగున పేర్చే రాళ్లు, గోలీలు పరిసరాల రంగుతో మ్యాచ్ అయితే ఆకర్షణీయంగా ఉంటుంది.

ఈ ప్లవర్ పాట్‌ను టీపాయ్ మీద పెట్టేటట్లయితే సోఫా సెట్ కలర్ లేదా గోడల రంగును దృష్టిలో పెట్టుకోవాలి. ఆలా సాధ్యం కానప్పుడు ఆ గదిలో ఉండే మరో వస్తువుల మీదకు చూపు సారించాలి. ఫ్రిజ్, పుస్తకాల షెల్ప్, వాల్ హేంగింగ్, పెయింటింగ్, కర్టెన్‌లు వంటి వాటిమీద కూడా పెట్టవచ్చు.

ప్లవర్ డెకరేషన్‌కు ప్రత్యేకమైన పూలను సేకరించనక్కరలేదు. ఇంట్లో దొరికే అన్నిరకాల క్రోటన్ ఆకులను, పూలను, జినియా, దాలియా, మందార, ఉమ్మెత్త ఇలా అందుబాటులో ఉన్న పూలను వాడవచ్చు. అయితే పూలను అమర్చడంలోనే అందం వస్తుందని గ్రహించాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇంటికి సరికొత్త అందం.. స్ఫటిక శిల్పాకృతులు  
కంప్యూటర్ బల్ల అందంగా...!
సోఫాసెట్ కొంటున్నారా..? కాసేపు ఆగండి..!!
ఇంటిని నందనవనంగా మార్చే పూల మొక్కలు
ఇల్లు, ఆఫీసుకు సేఫ్టీ గ్లాస్‌తో హుందాతనం...
బెడ్ రూం అలంకరణ తీరు తెన్నులు