ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > మదిని మైమరపించే "పుష్పాలంకరణ"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మదిని మైమరపించే "పుష్పాలంకరణ"
FILE
వేసవి చల్లదనం కోసం పరుగులెత్తే మదిని పూల అలంకరణలు మైమరపిస్తాయి. అలసటను దూరం చేసి స్వాంతననిచ్చే వీటి అలంకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే...

పుష్పాలంకరణ అంటేనే... కేవలం కొన్ని పువ్వులు, ఆకులు, కొమ్మలను హడావిడిగా పిన్ హోల్డర్లకు గుచ్చేసి ఓ మూల అమర్చటం కాదు. ఎంత సాధారణంగా చేసినప్పటికీ, పువ్వుల అమరికకు ఓ ప్రత్యేకమైన డిజైను ఉండాలి. రంగు, సమతూకం, రిథమ్, దిశ లాంటివన్నీ తప్పనిసరిగా గమనించాలి. అప్పుడే అది అసలైన అలంకరణ అనిపించుకుంటుంది.

పువ్వుల అమరికలో పండ్లు వాడేటట్లయితే.. అవి కిందికి ఒంగి ఉండే కొమ్మలనే ఎంచుకోవాలి. మొక్కకు సంబంధించిన జీవప్రక్రియ మొత్తం కనిపించేలా.. కొమ్మలు, ఆకులు, పువ్వులు మాత్రమే కాదు... సంబంధిత మొక్కకు చెందిన మొగ్గల్ని సైతం వినియోగించాలి.

ఫ్లవర్ వాజుల్లో అమర్చిన నీటిని ప్రతిరోజూ మార్చినట్లయితే, పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ముఖ్యంగా అలంకరణ చేస్తున్నప్పుడు హడావుడి పడకూడదు. నిదానంగా చేయాలి. లేదంటే మీ శ్రమ అంతా వృధా అవుతుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గృహాలంకరణలో ఎలాంటి స్టైల్ ఉండాలి..?
మీ ఇంటిని మీరే తీర్చిదిద్దుకోండి
గృహాలంకరణలో మొక్కలు, జంతువుల పాత్ర
కాంతులీనే "డ్రాయింగ్ రూమ్"
బాత్రూమ్‌ను పరిశుభ్రంగా ఉంచుకోండి...!
గృహాలంకరణలో ఫర్నీచర్ పాత్ర