దుస్తులు కుట్టే సూదుల్ని ఎక్కడపడితే అక్కడ ఉంచేస్తే తుప్పు పడతాయి. వాటిని వాడితే.. ఆ తుప్పు దుస్తులకూ అంటుకుంటుంది.
అందుకే కొన్న సూదుల్ని ఏ కాగితానికో గుచ్చేసి సొరుగులో పెట్టేయకండి.
వాటిని ఓ చిన్నిడబ్బాలో ఉంచి.. సూదులకు అంటుకునేలా బాగా టాల్కమ్‌పౌడర్ వేయండి. ఇలా చేస్తే ఎంతకాలమైనా సూదులు తుప్పుపట్టవు. |