ఇంట్లో వెలుతురు మరీ ఎక్కువైనా.. తక్కువైనా.. ఇబ్బందే! రోజువారి విధుల్లో.. ట్రాఫిక్ రణగొణధ్వనుల కాలుష్యం, వాయు కాలుష్యం వల్ల కళ్లకు ఎంతో ఒత్తిడి కలుగుతోంది.
ఇంటికొచ్చాక కూడా లైటింగ్ వల్ల కళ్లకు ఇబ్బంది కలిగితే భరించటం కొద్దిగా కష్టమే. అందుకే మన నేత్రాలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని రీతిలో లైట్లను అమర్చుకోవాలి. ఇందుకోసం పెద్దగా కష్టపడక్కర్లేదు.
దీనికోసం ఓ స్పాట్ లైట్‌ను ఎంచుకుంటే, ఆ వస్తువు మరింత ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా కన్పిస్తుంది. మూడ్ లైటింగ్‌తో కూడా మీ ఉద్దేశం నెరవేరే అవకాశముంది. ఎందుకంటే.. అవసరమైన ప్రదేశం వరకే వెలుతురు వచ్చి, చుట్టూ సన్నటి ధారలా పరుచుకుంటుంది. అవసరం లేనప్పుడు గదిలో ఇతర లైట్ల వాడకాన్ని నివారించొచ్చు. |