బెడ్ రూం అనేది ఓ స్వర్గధామంలాంటిది. ప్రతి ఒక్కరి జీవితంలో అదో స్వర్గపు గది. ఇందులో మీ వ్యక్తిగతమైన జీవితం నిండి ఉంటుంది. ఈ మీ వ్యక్తిగత జీవితపు గదిలో మీరు స్వతంత్రులు. నిస్సంకోచంగా మీరు విశ్రాంతి తీసుకునే గది. కాబట్టి మీ బెడ్ రూం ఎలా ఉండాలో దానికోసం కొన్ని చిట్కాలు మీకోసం.
బెడ్ రూం అనేది కేవలం నిద్రపోయేందుకు మాత్రమే కాదు. నిద్ర అనేది ప్రశాంతంగా రావాలి. నిద్రపోయేటప్పుడు ఎలాంటి భంగం కలగకూడదు. మంచి బెడ్, కళ్ళకు సరిపడా కాంతి ఆ గదిలో ఉండేలా చూసుకోండి. అందునా గదిని అందంగా అలంకరించుకోండి. మీ స్వర్గధామమైన బెడ్ రూంను ఎలా అలంకరించుకోవాలో ప్రయత్నించి చూడండిలా...!
** ముందుగా మీ బెడ్ రూం రూపురేఖలు తయారు చేసుకోండి.
** బెడ్ రూంలో ఉంచే వస్తువుల వాటి స్థానంలో ఉన్నాయా లేదా చూసుకోండి.
** మీ బెడ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి.
** మీ బెడ్ రూం శృంగారానికి నిలయమన్న విషయం గుర్తుంచుకోండి.
** అందంగా అలంకరించుకోండి. ఇందులో వీలైతే పూల సువాసనలు వెదజల్లే పూల మొక్కలు ఉంచుకోండి. వాటి బాగోగులు మీరే చూసుకోండి.
** మీ బెడ్ రూం గదిలో వెలుతురు తగిన విధంగా ఉండేలా చూసుకోండి. |