ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > బాత్రూమ్‌ను అలంకరించండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాత్రూమ్‌ను అలంకరించండిలా...!
ప్రస్తుత జీవితం రణగొణ ధ్వనులు, ఉరుకులు పరుగుల మధ్య గడచిపోతోంది. ఇంటికి రావడంతోనే నేరుగా బాత్రూంలోకి దూరుతాం. అక్కడే కాస్త శరీరానికి కలిగిన అలసట తొలగిపోతుంది. కాస్త ఒత్తిడికూడా అక్కడే దూరమౌతుంది.

బాత్రూంలోని షవర్ నుంచి జాలువారే చల్లటి నీటి తుంపర శరీర అలసటను దూరం చేస్తుంది. చల్లటి నీటితో శరీరం పులకించిపోతుంది. బాత్రూంనుంచి బయటకు రాగానే శరీరం మళ్ళీ కొత్త శక్తిని నింపుకుంటుంది. ఆ తర్వాత ఏ పనికైనా సిద్ధం అంటుంది శరీరం.

** బాత్రూం అనేది మీ శరీరంలోనున్న అలసటను దూరం చేసేది. మళ్ళీ శక్తిని నింపేది. కాబట్టి అలాంటి బాత్రూంను శుభ్రంగా ఉంచుకోవాలి. అలంకరించుకుంటే ఇంకా బాగుంటుంది.

** బాత్రూంను అలంకరించుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అక్కడున్న ప్రతి వస్తువుకూడా కళాత్మకంగా ఉండాలి.

** కుటుంబంలోని ప్రతి సభ్యుడుకూడా తమ అవసరాలను తీర్చుకునేది అక్కడే కాబట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. బాత్రూంలో అందరి టూత్ బ్రష్‌లు ఒకే ట్రేలో ఉంచొచ్చు. కాని మీరు షేవింగ్ చేసుకునే సెట్ మాత్రం ప్రత్యేకంగా ఓ అరలో ఉంచుకోండి. బాత్రూంలో ఓ అల్మార ఉండేలా చూసుకోండి. దీంతో బాత్రూంకు అవసరమయ్యే వస్తువులన్నీకూడా ఉంచుకొనేందుకు వీలుగా ఉంటుంది.

** బాత్రూంలో అందమైన టవల్ హోల్డర్, సానిటరీ వేయర్‌తోబాటు అందమైన కొవ్వొత్తులు ఉంచండి. మీకు వీలైనన్ని కొవ్వొత్తులు ఉంచండి. ఆ వెలుతురులో స్నానం చేయండి. ఆ మజాయే వేరు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బెడ్ రూం ఎలా ఉంది...!
మొక్కలను కొంటున్నారా....!
ఇంటికి వెల్ల వేస్తున్నారా...!
ఇంట్లో వెలుగురేఖలు.. నింపండిలా...!
ఏమండీ... టీవీ కొంటున్నారా...!
సూదులపై పౌడర్‌