** సూప్ తీసుకునేటప్పుడు చెంచా మొన భాగంలోనుంచి కాకుండా సైడ్‌నుంచి సేవించండి.
** మీ ప్లేట్‌లో అక్కడున్న ఆహార పదార్థాలను ఎక్కువగా వేసుకోకండి. దీంతో తినడానికి ఇబ్బందిగా మారుతుంది. చూసేందుకుకూడా ఎబ్బెట్టుగా ఉంటుంది.
** పాపడ్, చిప్స్ లేదా శబ్దం చేసే ఆహార పదార్థాలను శబ్దం తక్కువ వచ్చేలా తినండి.
** గింజలున్న పండ్లను తినేటప్పుడు గింజలను నోటితో తీయకండి. చెంచాతో తీసి తినండి.
** చేప ముళ్ళను లేదా మాంసపు ముక్కల ఎముకలు తీసి మీ ప్లేట్లోని ఓ పక్కన ఉంచండి.
** వేడిగా ఉండే పూరి మధ్యలో వేలు పెట్టి రంధ్రం చేయకండి. అది చూసేందుకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.
** డైనింగ్ టేబుల్‌పై మీరు తిని పడేసిన ఎంగిలి పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకండి. దానికని ఓ ప్రత్యేకమైన ప్లేట్లో వేయండి.
** మీరు భోజనం చేసేటప్పుడు మెల్లగా లేదా వేగంగా తినడం ఏమంత మంచిదికాదు.
** డైనింగ్ టేబుల్ వద్ద అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు ఎవ్వరితోనూ ఏ విషయంగానైనాకూడా చర్చలు పెట్టుకోకండి.
** డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని భోజనం చేసిన తర్వాత మీరు వాడిన నైఫ్ లేదా ఫోర్క్ లేదా చెంచాను ప్లేట్ల్ మధ్య భాగంలో ఉంచండి. న్యాప్‌కిన్‌ను ప్లేట్ పక్కన ఉంచండి. |