గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. ఆ స్వర్గసీమను అందంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలంటున్నారు ఇంటీరియర్ డెకొరేటర్స్.
మీ ఇంటి అలంకరణ, ప్రత్యేకించి మీ గదుల్లో ఏ ప్రాంతం ముఖ్యమైందో గమనించండి. అక్కడ ఏవిధంగా అలంకరిస్తే బాగుంటుందో దానికి కొన్ని సూత్రాలు పాటించండి.
** మీ ఇల్లు ప్రశాంత నిలయంగా ఉండేలా తీర్చిదిద్దడానికి మీ ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్ణంగా తెలిసివుండాలి. అప్పుడే ఇంటి అలంకరణ విషయంలో స్పష్టమయిన అవగాహన కలిగివుంటారు.
** మీ ఇంట్లోని ప్రతి గది ఫోకస్ పాయింట్‌లా వుండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశంలో మీ అభిరుచికి తగినట్టు ప్రత్యేకమైన శిల్పాలు, చిన్నపిల్లల బొమ్మలు, లైటింగ్ టేబుల్స్ లాంటివి అమర్చండి. చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా అలంకరించండి.
** మీరు గదిలో అమర్చిన లైటింగ్‌ను బట్టి ఆ గదియొక్క అందాన్ని మరింతగా ఇనుమడింపచేస్తుంది. మీ గది రంగునుబట్టి బల్బులను అమర్చండి. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దానిపై ఫ్లవర్ బేసిన్‌ను పెట్టండి. రంగురంగుల డిజైన్‌లో వుండే బేసిన్‌లో నీళ్ళు పోసి, దానిపై రంగురంగుల అందమైన పూలను అమర్చండి. |