ప్రతి మహిళకూడా తమ ఇంటిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంలో అందెవేసిన చెయ్యి. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దలు. అలాంటి దీపం తమ ఇంటిని చక్కగా అలంకరించి అందంగా ముస్తాబు చేస్కుంటుంది.
ఇంట్లోని హాల్ అందం పెరగడానికి దివాన్‌సెట్లని అందంగా తీర్చిదిద్దుతుంటారు నేటి మేటి మహిళామణులు. ఇంటికి వచ్చిన అతిథులు కూర్చోవడానికైనా, కాస్త నడుం వాల్చడానికైనా ఇవి సౌకర్యంగా ఉంటాయి. ప్లెయిన్, వర్క్, డిజైన్స్, ప్రింటింగ్ కలిగి ఉన్న బెడ్‌షీట్స్ వీటిమీదకి బాగానే ఉన్నా ఇప్పుడవి అవుట్‌డేటెడ్ ఫ్యాషన్స్ అయిపోయాయి.
మీ ఇంటికి వచ్చిన వారికి మీ ఇల్లు మరింత అందంగా కనపడాలంటే మీరు వాడే బెడ్‌సెట్ స్టైల్‌ని కాస్త మార్చి చూడండి. మరి ఆసెట్ మీదకి ఎలాంటి రంగులు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో చూద్దాం.
పర్పల్: ప్రస్తుతం ఈ కలర్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ రంగులో ఇప్పుడు ఎరుపు రంగు మిక్స్ అయి బెడ్ షీట్లు వస్తున్నాయి. పర్పుల్‌లో లావెండర్ , పర్పుల్ లైన్స్ రింగ్స్ ఇమిడి ఉన్న బెడ్‌షీట్లు దివాన్‌కు ఇప్పుడు ఎంతో అందాన్నిస్తున్నాయి. ఇవి ఇప్పుడు గ్రే, బ్లాక్, వైట్ రౌండ్స్‌లో మార్కెట్లో లభిస్తున్నాయి.
గ్రీన్: గ్రీన్ కలర్ చాలామందికి నచ్చుతుంది. ప్రస్తుతం గ్రీన్ కలర్ టాప్‌లో చేరింది. ఇది ఎకో ఫ్రెండ్లి కలర్ కాబట్టి ఏకాలంలోనైనా ఇట్టే సెట్ అవుతుంది. ఇంటికి ఇది ఓ హుందాతనాన్ని తీసుకొస్తుంది. ఇలాంటి బెడ్‌షీట్లని పరిస్తే మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాటిని చూసి మీ అలంకరణకు ముగ్దులౌతారనడంలో సందేహం లేదు.
అక్కడ వారు ఉన్నంతసేపు ప్రకృతితో గడిపిన ఆనందానికి లోనవుతారు. ఈ రంగుల్లో బోల్డ్ ఫ్లోరల్, లీఫ్ డిజైన్స్, బ్రైట్ కలర్స్ బాగుంటాయి. వీటిమీద సన్‌లైట్, గ్రీన్ ఫీల్డ్, సముద్రం, బీచుల్లాంటి ఆర్ట్ ఉంటే ఇంకా అందంగా ఉంటుందంటున్నారు ఇంటీరియర్ డెకార్స్ వారు. |