ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > అందమైన ఇంటికోసం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అందమైన ఇంటికోసం
గతంలో ఇంటికి ముదురు రంగులు వేయించుకోవడానికి ఇష్టపడే వాళ్లు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. ముదురు రంగులను వాడటం ఫ్యాషన్ అయ్యింది. పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది.

పెయింటింగ్‌లో షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నా వేరే రంగుతో కలిసినప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. ఏ రంగు ఎలా ఉంటుందో ఆ వివరాలే ఇవి...

* పసుపు, ఎరుపు రంగులు కంటికి నిండుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు ఉండే ఈ రంగులు ఉత్సాహాన్నిస్తాయి. వీటిని ఎంపిక చేసుకునే ముందు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎలాగంటే అలా తీసుకుంటే మరీ గాడిగా కనిపిస్తాయి.

* పోస్టల్ రంగులైన పౌడర్ పింక్, బేబి బ్లూ, సాఫ్ట్ గ్రీన్‌లు చూడగానే హాయిగా అనిపిస్తాయి. ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ ఈ రంగుల వల్ల మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది.

* ముదురు రంగులు గదిని తేజోవంతంగా ఉంచుతాయి. పెద్ద గదులకు ఈ రంగులే బాగా నప్పుతాయి. పోస్టల్ రంగులు డల్‌గా అనిపిస్తాయి. అందులోనూ సూర్యకాంతి పడకుండా కరెంట్ ద్వారానే వెలుగు వచ్చే గదుల్లో ఈ రంగులు వాడితే వాతావరణం మరింత డల్‌గా తయారవుతుంది.

* కొన్ని రంగులని వేరే రంగు పక్కన వేస్తే భిన్నంగా ఉంటాయి. పసుపు రంగును బ్రౌన్ రంగు పక్కన వేస్తే పసుపు రంగు కంటికి హాయిగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు పక్కన పసుపు రంగు వేస్తే మాత్రం కొట్టొచ్చినట్టు ఉంటుంది.

* పోస్టల్ లేదా లేత రంగులు వేస్తే గది పెద్దగా కనిపిస్తుంది. ముదురు రంగులు కొట్టొచ్చినట్టు కనిపించినప్పటికీ గది చిన్నదిగా అనిపిస్తుంది.

* గదికి రెండు మూడు రంగుల కాంబినేషన్‌లు కూడా వాడొచ్చు. ఇలాంటప్పుడు వేసిన రంగుల్లో ఒక షేడ్ మిగతా రంగులను మించి కనిపించేలా ముదురుగా ఉండాలి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇంటి అందం రంగులోనే ఉంది!
గృహాన్ని అందంగా మలచుకోండిలా...!
పిల్లల గది ఎలాగుండాలంటే...!
గృహాలంకరణ చేయండిలా...!
డైనింగ్ టేబుల్ మ్యానెర్స్ పాటించండిలా...!
బాత్రూమ్‌ను అలంకరించండిలా...!