ప్రతి ఒక్కరు ఇంటినిడా రకరకాల కుండీలను అమర్చుకుని అందులో రకరకాల పూలమొక్కలను పెంచుకోవాలనుకుంటుంటారు. కానీ ఇది అందరికీ అనుకూలించదు. కాబట్టి ఓ కుండీని మీకు నచ్చిన చోట ఓ పదిహేనురోజులపాటుంచండి. ఆ తర్వాత దానిని ఇంటి వెలుపల నీడలోనే ఉంచండి. మరో కుండీని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి.
** ఇంట్లో పెంచే మొక్కలను ఏడాదికోసారి మార్చుకుంటుండాలి. వీటిని సాధారణంగా జులై...ఆగస్టునెలల మధ్యలో మార్చుకోవాలి. అలా కుదరని పక్షంలో జనవరి లేదా ఫిబ్రవరి నెలలోకూడా మార్చుకోవచ్చు. ఇలా మొక్కలను మార్చుకునేటప్పుడు కుండీలను నేరుగా ఎండ తగిలేలా ఏర్పాటు చేయకూడదు. వాటిని నీడలోనే ఉంచి మార్చాలి.
** ఇంట్లో పెంచే మొక్కలకు వారానికి రెండుసార్లు నీళ్ళు పడితే సరిపోతుంది. కుండీలో కాస్త చెమ్మ ఉంటే మళ్ళీ నీళ్ళు పట్టాల్సిన పనిలేదు.
** కుండీలలో ఎర్రమట్టి, గుర్రపు ఎరువు, గొర్రె ఎరువులాంటివి మొక్కలకు మంచి లాభాన్నిస్తాయి. దీంతో మొక్కలు పుష్టిగా పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. |