ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > మీ ఇంటికి బంధువులు వస్తున్నారా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీ ఇంటికి బంధువులు వస్తున్నారా...!
సాధారణంగా ఇంటికి పిల్లల స్నేహితులు, బంధువులు, అతిథులు వస్తుంటారు. ఇలా ఇంటికి అతిథులు వచ్చినప్పుడల్లా ఇంటిని సర్దుకుంటూ ఉండాలంటే బోలెడంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

అలా కాకుండా, వీలు చూసుకుని ఇంట్లో దుమ్ముధూళి దులిపేసి అలంకరణలో కొద్దిపాటి మార్పులు చేసినట్లయితే, ఇల్లు అప్పుడే అలంకరించినట్లుగా కనిపిస్తుంది.

దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అన్ని గదుల్లోను నూలుతో చేసిన కర్టెన్లు వేసినా కూడా అందరూ కూర్చునే చోట మాత్రం కాస్త వైవిధ్యం చూపిస్తే సరిపోతుంది. అంతగా వాడని బెనారస్ చీరలు, మెరిసే చున్నీలను కర్టెన్లపైన అదనపు అలంకరణలుగా చేర్చి చూడండి, తేడా ఇట్టే తెలిసిపోతుంది.

** గది గోడలమీద ఇప్పటివరకూ ఫొటోలున్నట్లయితే... ఇప్పుడు వాటి స్థానంలో సరికొత్త ప్రకృతితో మమేకమైనటువంటి వాల్‌పోస్టర్లను ఇంటి గోడలపై అతికించిచూడండి. లేకుంటే, ఏవైనా చక్కటి కళాకృతులను అమర్చండి. ఇప్పటిదాకా అలాంటిదే ఉన్నట్లయితే, మీ పిల్లల అందమైన ఫొటోలను తగిలించండి.

** బంధువులు, మీ పిల్లల స్నేహితులు వచ్చారంటే ఫ్యామిలీ ఆల్బమ్ చూడటం పరిపాటే. చాలామంది సమయం సరిపోక వివిధ సందర్భాల్లో తీసిన ఫొటోలన్నీ కవర్లలో అలాగే కట్టలు కట్టలుగా ఉంచేస్తుంటారు. వాటిని కాస్తంత పద్ధతిగా ఆల్బమ్‌లలో సర్ది అందుబాటులో ఉంచినట్లయితే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా బంధువులకు చూపించవచ్చు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇంట్లో మొక్కలను పెంచండిలా...!
మీ బెడ్‌రూం ఎలా ఉంది?
అందమైన ఇంటికోసం
ఇంటి అందం రంగులోనే ఉంది!
గృహాన్ని అందంగా మలచుకోండిలా...!
పిల్లల గది ఎలాగుండాలంటే...!