** ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో మహిళలు నిరంతరం శ్రమిస్తుంటారు. మరింత అందంగా తీర్చిదిద్దేందుకుగాను ఇంటి కిటికీలు, తలుపులు, గోడలు మొదలైన ప్రదేశాలలో గ్లాసులను అలంకరించండి. వీటిపై మీకు వీలైతే గ్లాస్ పెయింటింగ్ వేయించండి లేదా పెయింటింగ్‌తో కూడుకున్న గ్లాస్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఇంట్లో అలంకరించండి.
** మీ ఇంట్లో పిల్లల గది రంగులమయం చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు రంగులంటే చాలా ఇష్టం. పిల్లలుండే గది గోడలకు ఎనామిల్ ప్రింట్ లేదా కార్టూన్‌లలోని పాత్రలకు చెందిన పోస్టర్‌లు అంటించండి.
** మీరుండే ఇల్లు చిన్నదిగా ఉంటే అందులోని గదులు చిన్నవిగానే ఉంటాయి. ఆ గదులను పెద్దవిగా కనపడేలా ఉంచాలనుకుంటే ఏక్సెంట్ లైట్‌ను ఉపయోగించండి. ఆ లైట్‌ను ఫర్నీచర్ లేదా వాల్ ఆర్ట్‌పై ఫోకస్ చేయండి. దీంతో చిన్న గదికూడా పెద్ద గదిలా కనపడుతుంది.