ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » వారానికి ఒకసారి ఇంటిని శుభ్రం చేస్తుండండి (House | Window | Dirty | Clothes | Veniger | Baking Soda)
 
ఇంట్లోని వంటగదికున్న కిటికీలోని ఇనుప మెష్‌కు దుమ్ము, మురికి పట్టుకొని చేతులకు, దుస్తులకు నల్లటి మరకలు పడతుంటాయి. అలాంటప్పుడు తలకు రంగు వేసుకునే బ్రష్‌ను సబ్బుద్రావణంలో ముంచి మెష్‌ను శుభ్రపరచండి. కిరోసిన్‌లో ముంచిన వస్త్రంతో ఇనుప తీగలను తుడిస్తే తప్పు వదులుతుంది.

టాయ్‌లెట్, సింక్, డ్రైనేజీ పైపులను శుభ్రపరచడం వీలుకాని పని. అందుకే వెనిగర్, బేకింగ్ సోడాను కప్పు చొప్పున కలిపి నాలుగు మగ్గుల నీళ్లలో బాగా మరిగించండి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పైపుల్లో పోస్తే మధ్యలోనున్న అడ్డంకులన్నీ నీళ్లతోపాటు కొట్టుకుపోతాయి. వెనిగర్, సోడా క్రిములను హరించి వేస్తుంది.

చెత్త బుట్టలను ఏ రోజుకారోజు తీయకపోతే దోమలు, క్రిములు ఇంట్లోకి చేరిపోతాయి. అందుకే కనీసం వారానికోసారి నీళ్లతో కడగాలి. లీటరు నీటిలో అమోనియాను కలిపి లోపల బయట స్క్రబ్బర్‌తో రుద్దండి. అమోనియాకు బ్యాక్టీరియాతో పోరాడే తత్వం ఉంటుంది. తరవాత బోరిక్ పొడిని, తేమ ఆరాక బేకింగ్ సోడాను చల్లండి, ఇవి దుర్వాసనలను పోగొడతాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.