మీరు కొనే ఇంటికి ఉత్తర - దక్షిణ దిక్కుల పొడవుకన్నా తూర్పు- పశ్చిమ దిక్కుల పొడవు తక్కువగా ఉంటే అత్యంత శుభకరం.
మీ ఇంటి ముఖద్వారం తూర్పు లేదా ఉత్తరం దిక్కును చూస్తూ ఉండేలా చూసుకోండి.
గృహం పశ్చిమ దిక్కులో ఎత్తుగా ఉంటే ఆ ఇంటి యజమానిపై మంచి ప్రభావం ఉంటుంది. ధనవృద్ధి కలుగుతుంది. ఇలా ఉంటే ఇంటి యజమానితోపాటు కుటుంబంలోని సభ్యులందరి ఆరోగ్యం బాగుంటుంది.