పడకగదిలో మీరు వేసుకునే బెడ్ దక్షిణాన ఉన్న గోడకు ఆనించి ఉంచండి. తలగడ దక్షిణ దిక్కులో ఉండేలా చూసుకోండి. మీరు పడుకునే సమయంలో మీ తల దక్షిణ దిక్కులో ఉండేలా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోను మీ తలగడ తూర్పు లేదా ఉత్తర దిక్కున ఉంచి నిద్రించకండి.
మీరు నిద్రించే సమయంలో మీ తలగడ తూర్పు లేదా ఉత్తరం దిక్కులో ఉంచి నిద్రపోతే సుఖశాంతులు లభించవు. ఇంటి యజమానికి మానసికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. తలనొప్పి, నిద్రలేమి, వివిధ రోగాల బారిన పడే అవకాశాలున్నాయి.