ఇంట్లో ప్రతి వస్తువు క్రమంగా ఉండాలి. అలా ఉంటేనే చాలా బాగుంటుంది. అదే విధంగా ఇంటి నిర్మాణంలోను ఏ గది ఎక్కడ, ఎటుపైపు నిర్మించాలనేది తెలుసుకోవాలి. దీంతో గృహ యజమాని సంతోషంగా ఉంటారు.
ముఖ్యంగా ఇంటికి వాయువ్య దిశ కాస్త ఎత్తుగానే ఉండాలి. పల్లంగా ఉంటే శత్రువులు పెరుగుతారు. శత్రువుల వలన ఇంటి యజమానికి మానసికపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది.
ఒకవేళ ఇంటి దక్షిణం మరియు ఆగ్నేయం పల్లంగా ఉండి, వాయువ్యం మరియు ఉత్తరం ఎత్తుగా ఉంటే ఇంటి యజమాని అప్పుల్లో కూరుకుపోయి జబ్బులబారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏ ఇంట్లోనైతే నైరుతి మరియు దక్షిణ భాగం లోతుగా ఉండి, ఉత్తరం మరియు ఈశాన్యం దిక్కులు ఎత్తుగా ఉంటే ఇంటి యజమాని అపవిత్రమైన కార్యక్రమాలు, వ్యసనాలకు లోనవుతాడు. దీంతోపాటు మానసికపరమైన అశాంతి కలుగుతుంది.