ప్రస్తుతం చిన్న చిన్న గదుల్లోనే కుటుంబాన్ని సర్దుకోవాల్సివుంటోంది. దీంతో ఇంట్లో స్నానాల గది ఎక్కడుండాలనేది చాలామందికి సందేహం కలుగుతుంది.
ఇంట్లో స్నానాలగదితోపాటు శౌచాలయం కూడా ఒకే గదిలో ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుంది. దీనికి కొన్ని సూత్రాలు పాటిస్తే సరిపోతుంది. అదేంటంటే ఇంటికి పడమర-దక్షిణ భాగంలోకాని లేదా వాయువ్యంలో నిర్మించుకోండి.
ఆగ్నేయలో శౌచాలయం ఏర్పాటు చేసుకుని స్నానాలగదిని మాత్రం దానికి తూర్పుగా ఏర్పాటు చేసుకోండి. ఎట్టిపరిస్థితుల్లోను శౌచాలయాన్ని నైరుతి లేదా ఈశాన్యం దిక్కుల్లో ఏర్పాటు చేయకండి.