పూజకు సంబంధించిన సామగ్రిలో రాగి పాత్రలు కూడా వాడుతుంటారు, ఇలాంటి రాగి పాత్రలు ఎక్కువ రోజులు మన్నిక రావాలంటే ఏంచేయాలనేది సందేహం. ఆ సందేహానికి సమాధానం...
** రాగి సామగ్రిని వాడిన వెంటనే శుభ్రపరిస్తే ఎక్కువ కాలం మన్నుతాయి. పూజ ముగిసిన వెంటనే కొద్దిసేపు వేడినీటిలో నానబెట్టి డిష్‌వాష్ స్క్రబ్బర్‌తో రుద్దితే కొత్తగా మెరుస్తాయి.
** కప్పు తెల్ల వెనిగర్‌లో చెంచా ఉప్పు, కొద్దిగా గోధుమపిండి కలిపి పేస్టులా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని రాగి వస్తువులకు పూతలా వేసి గంటపాటు ఎండలో ఉంచి చల్లటినీళ్లతో శుభ్రపరచండి. దీంతో రాగి పాత్రలు తళతళలాడుతూ ఎక్కువకాలం మన్నుతాయి.