ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » అందమైన పూలతో గదిని అలంకరించాలంటే! (Flower pots | Room | Glass Holder | Cristal | Creepers | Flowers)
Feedback Print Bookmark and Share
 
** పూల సజ్జలతో మీ గదిలో అందం ఇనుమడిస్తుంది. గదిని అలంకరించేందుకు ఫ్లవర్‌పాట్ లాంటివి ఏదైనా పాత గ్లాసులను ప్రయోగించవచ్చు. గ్లాస్ హోల్డర్( ఉట్టి )లలో గ్లాస్‌లను ఏర్పాటు చేసుకోండి. వీటిలో నీటిని నింపి మీకు నచ్చిన రంగులను వేయండి. ఆ తర్వాత అందులో పూలను వేసి చూడండి. సువాసనలతోపాటు గది మొత్తం రంగులమయం అవుతుంది.

** ఫ్లవర్ వాజ్ లేక పూల సజ్జలపై ప్రత్యేకంగా క్రిస్టల్‌తో అలంకరించండి. వీటికి చిన్న బుట్టలు, ఫిషింగ్ క్రిల్, చిన్న చిన్న సాల్ట్ బౌల్స్, పాత మగ్గులు, కాఫీ పాట్స్ అలాగే ఏదైనా పర్‌ఫ్యూమ్ బాటిల్స్ తదితరాలను ఉపయోగించుకోవచ్చు.

** పూలు ఎక్కువ కాలం మన్నిక అయ్యేలా ఉండేందుకుగాను వాటి కాడలక్రింది భాగాన్ని కత్తిరించండి. దీంతో కాడలు నీటిని త్వరగా తీసుకుంటాయి. పూలు సజీవంగా ఉంటాయి.

** పూలను అలంకరించిన తర్వాత పూలపై నీటిని చిలకరిస్తుండండి. దీంతో పూలు తాజాగా కనపడతాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.