ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » వాస్తుననుసరించి చిత్రాలను అలంకరించండి (House | Sweet Home | Pictures | Happy Home | Ramayan | Mahabharath | War)
Feedback Print Bookmark and Share
 
ఇంట్లో వివిధ రకాల చిత్రాలను ఉంచడం లేదా విగ్రహాలను మనకు ఇష్టమొచ్చిన రీతిలో పెట్టుకోవడం పరిపాటి. కాని ఇంట్లో సుఖ శాంతులు వెల్లివిరియాలంటే కొన్ని విషయాలను ఖచ్చితంగా అమలు చేయాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

** స్నేహం- శాంతి సౌభాగ్యం వెల్లివిరిసేందుకు ఇంట్లో అందమైన అలంకారాలు కలిగిన బొమ్మలు ఉంచండి. కోపం, వైరాగ్యం, భయానకం, బీభత్సం, దుఃఖం తదితర చిత్రాలను ఇంట్లో ఉంచకండి.

** యుద్ధానికి సంబంధించిన, రామాయణం, మహాభారతానికి సంబంధించిన చిత్రాలు, రాక్షసుల విగ్రహాలు, కత్తులు, కటారులు, యోద్ధులు తదితర విగ్రహాలు, చిత్రాలు ఇంట్లో ఉంచకండి.

** కరుణ రసంతో ఉన్న స్త్రీ మూర్తి, ఎడుస్తున్న పాపాయి, కరువు-కాటకాలు, ఎండిపోయిన చెట్లు తదితర బొమ్మలు కలిగిన చిత్రాలుంచకండి.

** కోతులు, పాములు, గ్రద్దలు, పావురాలు, పులులు, కాకి, గుడ్లగూబ, ఎలుగుబంటి, నక్క, పంది మొదలైన బొమ్మలు, చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు.

** చారిత్రాత్మకమైన, పౌరాణికమైన సంఘటనలను గుర్తుకు తెచ్చే విధంగా ఇంట్లో చిత్రాలు కాని బొమ్మలు కాని ఉంచకండి.

** గుర్రం, ఒంటె లేదా జింక చిత్రాలను ఇంట్లో ఉంచుకోవచ్చు. ఇవి శుభకరమంటున్నారు వాస్తు నిపుణులు.

** కొందరు ఇంట్లో అదే పనిగా చాలా మంది దేవతల విగ్రహాలు లేదా చిత్రపటాలు పెట్టి పూజిస్తుంటారు. వీటివలన లాభంకన్నా నష్టమే ఎక్కువ. దేవుళ్ళ చిత్రాలు ఎక్కువగా ఉంచకూడదు.

** మనసుకు ఆహ్లాదం కలిగించే చిత్రాలు లేదా విగ్రహాలుంచండి.

** ఇంట్లో హంస చిత్రాన్నుంచితే సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.