ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » ఇంట్లో పెంచుకునే గార్డెన్‌కీ ఓ ప్రణాళిక తప్పనిసరి..!! (Interior Decoration | Home | Garden | Gardening | Trees | Sun Rays | Plants | Grass)
Bookmark and Share Feedback Print
 
House
FILE
*ఇంటి ఆవరణలో గార్డెన్ అంటే నాలుగు రకాల చెట్లు, కొన్ని పూల మొక్కలు నాటితే సరిపోతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ గార్డెనింగ్‌కి విలువైన సమయాన్ని కేటాయించడంతో పాటు క్రమం తప్పకుండా నీరు పట్టడం చేయాల్సి ఉంటుంది. ఏపుగా పెరిగిన చెట్లు ప్రహరీ గోడ చుట్టూ ఉంటే సూర్యరశ్మి తగినంత పడే అవకాశం ఉండదు. కాబట్టి తగినంత సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి.

* మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు సూర్యరశ్మి అవసరమయ్యే మొక్కలు, నీడన పెరిగే మొక్కల గురించి అడిగి తెలుసుకోవాలి. తర్వాత స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ముళ్లపొదలు, గడ్డి ఇతర చెట్టు ఏవైనా ఉంటే తొలగించాలి. పారతో గడ్డిని సులువుగా తొలగించుకోవచ్చు. కాబట్టి గార్డెన్‌కు అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసుకోవాలి. వాటితో స్థలం చదును చేసుకుని మట్టిని వదులుగా తవ్వుకోవాలి.

* స్థలం చదును చేసుకున్నాక మట్టి రకాన్ని పరీక్షించాలి. మొక్కలు ఎంపిక చేసుకునే ముందు మొక్కలు పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. వాతావరణ పరిస్థితులనుకూడా దృష్టిలో పెట్టుకోవాలి. పూలమొక్కలు, పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్‌లో పెంచుకోవచ్చు.

* మొక్కలకు సరిపడా నీరు పట్టడం కూడా చాలా అవసరం. ఏ మొక్కకు ఎంత నీరుపట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొక్కలు నాటిన మొదటి వారంలో రోజూ నీరు పట్టాలి. రెండవ వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పడితే సరిపోతుంది. మొక్కలు బాగా పెరిగాక వారానికొకసారి నీరు పట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పట్టాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆహ్లాదాన్నందించే గార్డెన్ మీ సొంతమవటం ఖాయం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.