ప్రధాన పేజి   ఇతరాలు > మహిళ > వ్యక్తిత్వ వికాసం
 
మంచి పుస్తకాలతో నిరాశావాదం దూరం
నిరాశావాదం చాలా మందిలో గూడుకట్టుకుని ఉంటుంది. ఉదాహరణకు ఎంతో చదవాలని ఉందని, అయితే మనసు నిలపలేకపోతున్నామని కొంత మంది విద్యార్థులు వాపోతుంటారు. మరికొంతమంది అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయామని నిస్సహాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.

నిజానికి మనకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకున్నప్పుడు ఇటువంటి నిరాశావాదానికి చోటు ఉండదు. అసలు వాస్తవాన్ని మరిచి ఉన్నత లక్ష్యాలను పెట్టుకోవటం ఎంతో తప్పిదమో, ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అన్నీ చేకూరాలని కలలుకనడమూ అంతే తప్పు.

ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని, ధైర్యాన్ని కలిగించే మంచి పుస్తకాలను చదవటం ద్వారా ఈ నిరాశావాద భావానికి దూరమై పాజిటివ్ భావన కలుగుతుందని నిపుణులు చెపుతున్నారు.
మరిన్ని
పురోగతికి ఆటంకం.. అసూయ