మీ జీవితంలో మీకే సొంతమైన ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ఆ దిశగా కష్టపడి పనిచేయండి. మీ భావాలను చక్కగా వ్యక్తం చేసే భాషను ఎంపిక చేసుకుని అందులో నైపుణ్యాన్ని సాధించండి. మరిన్ని కొత్తవిషయాలను నేర్చుకోవడం ద్వారా మీ భాషను అభివృద్ధి చేసుకోండి.
అలాగే, మంచి పుస్తకాలను చదవటం, విద్యా పరిధిని విస్తృతం చేసుకోవడం వల్ల ఎలాంటి విషయమైనా సరే తడబడకుండా మాట్లాడగల నేర్పరితనం, ఆత్మవిశ్వాసం మీలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. నావారు, నా ఉద్యోగం, నా కుటుంబం అని కాకుండా మీ జీవితానికి కొత్త అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని ఇచ్చేలా తయారవండి, పేదవారికి సాయం చేయడంలో మనసు లగ్నం చేయండి.
చిరునవ్వులను మించిన గొప్ప ఆత్మవిశ్వాసం మనిషికి ఎక్కడా లేదు. చిరునవ్వును మించి అందాన్ని పెంచే విలువైన నగ ఎలాంటిది లేదు. మంచిగా ఉండాలి, మంచి భావాలను కలిగి ఉండాలి. నిజాయితీగా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. ఎలాంటి గర్వం మీ దరి చేరకుండా మీలో మీరే తొంగి చూసుకోండి.
సమయ నిర్వహణ విషయంలో జాగ్రత్తగా వ్యహరించడం అలవరచుకోవాలి. మీ అభిరుచులే మీకు శాంతిని, సమతౌల్యాన్ని ప్రసాదించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయి. దూసుకుపోయే గుణం ఉండాలి, దూసుకుపోవడమే కాకుండా ఏదేని విషయాన్ని ధీమాగా నొక్కిచెప్పే గుణాన్ని అలవరచుకోవాలి.
చివరగా... మిమ్మల్ని మీరు తెలుసుకోండి.... మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి.... మీ జీవితాన్ని ప్రేమించండి.... ఆత్మవిశ్వాసం దానంతటదే వస్తుంది. |