ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > వ్యక్తిత్వ వికాసం > అసూయ... ఒక బలహీనత...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అసూయ... ఒక బలహీనత...!
ఇక్కడ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలి. మన చేతి ఐదువేళ్ళను నిషితంగా పరిశీలించండి. అన్ని వేళ్లూ ఒక ఎత్తులో, లావులో ఉంటాయా..? అసలు ఒకదానికి మరోదానికి ఎలాంటి సామ్యం ఉండదు కదా..! అలాగని ఒక వేలు మరో వేలును చూసి అసూయపడుతుందా...? ఏ వేలు ఉపయోగం దానిదే కదా...!

మీ దగ్గర లేనిది అవతలివారి వద్ద ఉన్నదని అసూయపడకుండా భగవంతుడు మీకు ప్రసాదించిన తెలివితేటలను ఎంత ఉత్తమంగా మీరు వాడుకోగలరో అంత ఉత్తమంగా వాడుకోవాలి. మీ మనస్సు పరిపక్వదశకు వచ్చినప్పుడు మీలో ఉన్న మంచి గుణాలను అభివృద్ధి చేసేందుకు అది ప్రయత్నిస్తుంది. అప్పుడు ఇతరులను చూసి అసూయపడటానికి కావలసిన సమయంగానీ, శక్తిగానీ ఉండవు.

అసూయ అన్నది ఒక బలహీనత, ఒక వక్రగుణం. చిన్న బుద్ధిగల వారే అసూయతో కృంగిపోతారు. పరిస్థితులు ఎటువంటివైనా మనం అసూయను సమర్ధించకూడదు. ఇది ముమ్మాటికి మనకు ఇంటాబయటా హానిని కలిగిస్తుంది. సక్రమమైన గుణాన్ని అభివృద్ధి పరుచుకోవడమే అసూయను దూరం చేసుకునే ఉత్తమ మార్గం.
<< 1 | 2 
మరిన్ని
న్యూనత వద్దు... ఆత్మవిశ్వాసమే ముద్దు...!
"కాస్త నవ్వితే నీ సొమ్మేంపోతుంది...!"
త్వరగా ఎదగాలనే తపనతో బాలికలకు చిక్కులు
కోపానికి విరుగుడు...
ముచ్చటైన కుటుంబానికి గృహిణే మహారాణి
ఆధునిక మహిళా... కాస్త ఆగవా