ఆహారాన్ని స్వీకరించడంలో సమతుల్యత, వైవిధ్యం మరియు మితంగా వ్యవహరించడం అనేవి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లుగా నిపుణులు నిర్ధారించారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఎక్కువ క్యాలరీలు పొందకుండా మరియు ఒకే దానిని అతిగా స్వీకరించకుండా అనేక రకాలు ఆహార పదార్ధాలను తీసుకోవడమన్నమాట. కింద పేర్కొన్న చిట్కాలు ఆహారాన్ని స్వీకరించడంలో అంతులేని ఆనందాన్ని అందిస్తాయి.
1. పోషక పదార్థాలు అధికంగా ఉండే వైవిధ్యభరితమైన ఆహార పదార్థాలను తీసుకోండి. ఆ లెక్కన మంచి ఆరోగ్యం కోసం వైవిధ్యమైన 40 రకాల పోషక పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఆహారం కూడా అన్నింటినీ అందించదు. మీ దినసరి ఆహార ఎంపికలో బ్రెడ్ మరియు పప్పు ధాన్య ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల పదార్థాలు, మాంసం, చేప మరియు ప్రోటీన్‌లతో కూడిన ఇతర పదార్థాలు. మీకు ఎన్ని క్యాలరీలు అవసరం అనే దానిని అనుసరించి మీరు ఆహారాన్ని తీసుకోవలసి రావచ్చు.
2. ధాన్యాలు, పండ్లు, పప్పు ధాన్యాలు మరియు కూరగాయలను అధికంగా తీసుకోండి. వీటిని తినడం ఇష్టం లేకపోతే వంట పుస్తకాలలో ప్రస్తావించే కొత్త రకాల వంటకాలను చేసుకుని తినడం ద్వారా వాటిపై ఇష్టాన్ని పెంచుకోండి.
3. ఆరోగ్యకరమైన రీతిలో శరీరం బరువు... మీ శరీరం యొక్క బరువు మీరు స్త్రీలా లేదా పురుషులా?, ఎత్తు, వయస్సు మరియు వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో అదనపు కొవ్వు శాతం, అధిక రక్తపోటు, హృద్రోగం, గుండెపోటు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులకు దోహదం చేస్తుంది. క్రమతప్పకుండా వ్యాయామం చేయడం ద్వార ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండవచ్చు.
4. మితాహారం శ్రేష్ఠం... మితాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు ఆహారాన్ని స్వీకరించడంలో సమయపాలన పాటించండి. ఎప్పుడు పడితే అప్పుడు తింటే, ఆశించదాని కన్నా అధిక పరిమాణంలో ఆహారాన్ని స్వీకరించే ప్రమాదముంది.
ఇక విపరీతంగా ఆకలి వేస్తున్నప్పుడు పోషక పదార్ధాలను మాత్రమే తీసుకోవాలన్న సంగతిని మర్చిపోవచ్చు. భోజనాల మధ్య చిరు తిండ్లు తింటే ఆకలి చచ్చిపోతుంది. అందుకే చిరు తిండ్లను భోజనం పరిమాణంలో తీసుకోవడం మంచిది కాదు.
|