ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నెలసరి కాలేదా... మీకోసం కాసీనభస్మం..
రుతుక్రమం సజావుగా సాగకుంటే మహిళలలో అనూహ్య సమస్యలు తన్నుకొస్తాయి. రోజువారీ జీవితంలో, పనిస్థలంలో కూడా నెలసరి సమస్య నిజంగానే పలు సమస్యలను కొని తెస్తుంది. ఈ నెలసరి సమస్యకు కాసీన భస్మం ఉత్తమ పరిష్కారంగా ఆయుర్వేదం పేర్కొంటోంది. ఎలాగో చూద్దాం.

ఆయుర్వేద మందుల షాపుల్లో దొరికే కాసీన భస్మాన్ని చిటికెడంత తీసుకుని తమలపాకు మీద వేసి, తేనె కలపి రంగరించి తమలపాకుతో సహా నమిలి వేయండి. దీనివలన స్త్రీలకు పలు ఉపయోగాలున్నాయి.

నెలసరి సమయంలో రుతుస్రావం సరిగా కానివారూ, నెలసరి సక్రమంగా రానివారూ, ఈ కాసీనభస్మాన్ని రెండు మూడు నెలలపాటు తక్కువ మోతాదులో విడువకుండా, వాడితే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి.

రక్తహీనత తగ్గుతుంది. మంచి ఆరోగ్యవంతమైన రక్తం పుడుతుంది.

తల వెంట్రుకలకు బలం ఇచ్చి, రాలిపోకుండా కొంతవరకూ నిరోధిస్తుంది. జీర్ణశక్తిని పెంచి, తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
మరిన్ని
తిండి తినేందుకూ ఓ పద్ధతి ఉండాలిగా..
బలవర్థక ఆహారం అక్రోట్
శరీరానికి పండ్లు చేసే మేలు
పాలతో పండంటి ఆరోగ్యం
పోషక విలువలున్న ఫలం అరటి..!
ఆరోగ్యంకోసం 40 రకాల పోషకపదార్థాలు