ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మధ్యవయసు స్త్రీల ఆహార నియమాలు
వయసు పెరుగున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం సహజమే.. ఇన్నాళ్లూ ఆహారంపై నియంత్రణ లేకుండా ఏది పడితే అది తినడం అలవాటయినప్పటికీ, ఇకనుంచీ జాగ్రత్తపడాలనే వైద్యుల సలహాలు గుండె గుబేలుమనిపిస్తాయి. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నిది అందరికీ తెలిసిన విషయమే
అయినా ఆచరణలోకి వచ్చేసరికి విఫలమయ్యే వారే ఎక్కువ. అయితే డైట్ ప్లాన్ వేసుకుని పక్కాగా ఆచరిచాలనుకుంటే అది బెడిసి కొట్టే ప్రమాదముంది కాబట్టి మన జీవన విధానంలోనే చిన్న చిన్న మార్పులతో ప్రయత్నిచడమూ తగిన ఫలితాన్నిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేమిటో చూద్దామా...

హడావుడిగా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడం కాక ఏం కావాలో అది మాత్రమే తినాలన్న నియమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి.

సూపర్ మార్కెట్‌కు వెళ్లాక అక్కడ నోరూరించే ఫాస్ట్ ఫుడ్ ఏదో ఒకటి కొనాలని ఉద్యోగినులు ప్రయత్నిస్తారు. అయితే వాటిలో ఉండే పోషకాలగురించి చదవండి. కొవ్వుశాతం, కెలోరీలు, మాంసకృత్తులు, పీచుపదార్థాలు, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని అప్పుడు కొనండి.

చిప్స్ బర్గర్లుస పిజ్జాలు వంటివి పిల్లలకు పెద్దలకు కూడా ఇష్టమే. వాటి బదులు పండ్లను రుచిచూడండి. ఇంకా సలాడ్ల రూపంలో తీసుకోండి. శీతలపానీయాల బదులు పండ్లరసాలు తాగండి. పీచు తగినంత అందుతుంది కాబట్టి ఒళ్లు పెరగదు.

పుదీనా కొత్తిమీర కరివేపాకు, మెంతి ఆకు, తదితరాలను వంటకాల్లో ఎక్కువగా చేర్చండి. అవి ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాదు తక్కువ కెలోరీలు అందిస్తాయి. ఎలాంటి కూరలనైనా నోరూరించేలా చేస్తాయి.

పొద్దున్నే ఉపాహారం తినడం మానేయకండి. ఉపాహారం మానేస్తే అధికబరువు సమస్య రెట్టింపవుతుందని మరువకండి. ఒకే సారి ఎక్కువగా తినకుండా ప్రతిరెండు మూడు గంటలకోసారి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోండి.

అన్నిటికంటే మించి వండే వంటకాల్లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.

నీళ్ల సీసా పక్కన పెట్టుకుని తరచుగా కొంతు తడుపుకోండి.

ఏదైనా టీవీ చూస్తూ, పుస్తకం చదువుతూన్నప్పుడు తినాలనిపిస్తే పండ్లు, వేయించిన వేరుశనగలు, మొలకెత్తిన గింజలు వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వండి.

జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడితే నెమ్మది నెమ్మదిగా తగ్గించండి. వీలైనంతవరకూ వాటిని ఇంటికి తీసుకురావద్దు. తినాలి.

ఇవి జీవనవిధానంలో మార్పులే కాని డైటింగ్ నియమాలు కావు. కాబట్టి వీటిని పాటించడం కష్టం కాదు. నడివయస్సులో లావు తగ్గించుకోవాలంటే ఆహారంలో ఇలాంటి మార్పులు
మరిన్ని
గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..
నెలసరి కాలేదా... మీకోసం కాసీనభస్మం..
తిండి తినేందుకూ ఓ పద్ధతి ఉండాలిగా..
బలవర్థక ఆహారం అక్రోట్
శరీరానికి పండ్లు చేసే మేలు
పాలతో పండంటి ఆరోగ్యం