ఎండలు మండుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఎండలకు ఏదైనా పళ్లరసం తాగితే కాస్తంత ఉపశమనం దొరుకుతుంది. వేసవి తాపాన్ని తీర్చే అనేక పండ్లు మనముందు ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కనుక మనకు అందుబాటులో ఉన్న పండ్లతో ఎలా సరిపుచ్చుకోవచ్చో తెలుసుకుందామా...
మామిడి... యాపిల్ వంటి పండ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి కనుక పుచ్చకాయలను ఆశ్రయించండి. వీటిలో ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ వాటి ధర ఎక్కువనిపిస్తే... నిమ్మకాయలను తీసుకుని వాటి రసాన్ని మజ్జిగలో కలుపుకుని సేవించండి. వేసవి తాపం తీరటంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చంటిపిల్లలు ఉన్నట్లయితే వారికి ఖర్జూరాలను నానబెట్టిన నీరు, బార్లీ నీరు, కొబ్బరి నీళ్లు అప్పుడప్పుడు పడుతూ ఉంటే డీహైడ్రేషన్ సమస్య దరి చేరదు.
|