ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డయాబిటీస్ మహిళలకు సరైన ఆహారం..  Search similar articles
Raju
మనిషిని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ ఒకెత్తయితే, డయాబిటీస్ ఒకటీ ఒకెత్తుగా మారిన ప్రస్తుత కాలంలో ఆహార నియంత్రణే ఈ వ్యాధి నివారణకు మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెలోరీలు తక్కువగా ఉండే ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసుకోవాల్సిందిగా కూడా ముందుజాగ్రత్తలను సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నడివయస్సులో ఉన్న మహిళలకు మధుమేహ వ్యాధికి తీసుకోవలసిన ఆహారపదార్థాలేమిటో చూద్దామా..

డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో పీచు, కార్బోహైడ్రేట్స్, వంటి పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. జొన్న, మొక్క జొన్న, గోధుమ, దంపుడు బియ్యం, మొలకెత్తిన గింజలు, పళ్లూ, కూరగాయలు, ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్ధాలైన నెయ్యి, వెన్న, జున్ను, మీగడ వంటి పదార్ధాలను బాగా తగ్గించాలి. వేపుళ్లు పూర్తిగా తగ్గించాలి. ఇవి పెరిగితే దయాబెటిక్ పేషెంట్లలో గుండె జబ్బులు పెరిగే అవకాశం పెరుగుతుంది కాబట్టి వాటన్నింటినీ తగ్గించాలి.

తీపి పదార్ధాల విషయానికి వస్తే చక్కెర, తేనె, బెల్లం చాలా పరిమితంగా తీసుకోవాలి. బ్రెడ్స్, బేకరీ ఫుడ్స్, కార్న్‌ప్లేక్స్ వంటి పీచు తక్కువగా ఉండేవి, మైక్రో న్యూట్రియంట్స్ తక్కువగా ఉండే పదార్ధాలను పూర్తిగా తగ్గించాలి. తాజా కూరగాయల్లో పీచు పదార్థాలు, కొన్ని విటమిన్లు, పైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

చక్కెర వ్యాధి మహిళలు చురుగ్గా ఉండడానికి సుగర్ అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. అన్నిటికి మించి కొద్ది మోతాదులో ఎక్కువసార్లు అనే ఆహార నియమం సుగర్ వ్యాధి గ్రస్తులకు తప్పనిసరి. బెడ్ టైం శ్నాక్స్ తీసుకోవడం ఉత్తమం.

అయితే ఇవన్నీ బ్రాడ్‌గా చెబుతున్న సాధారణ నియమాలు మాత్రమే. ఎంత బరువున్నారు, దైనందిన యాక్టివిటీస్, ప్రస్తుత బ్లడ్ సుగర్ లెవల్స్, చక్కెరను కంట్రోలు చేయడానికి వాడుతున్న మందులు ఇలా రకరకాల పరామితుల ఆధారంగా సుగర్ వ్యాధిగ్రస్తులకు సమగ్ర వివరాలతో కూడిన న్యూట్రిషన్ ప్లాన్ తయారు చేసుకోవాలి.
మరిన్ని
వేసవిలో మేలు చేసే పుచ్చకాయ  
మధ్యవయసు స్త్రీల ఆహార నియమాలు
గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..
నెలసరి కాలేదా... మీకోసం కాసీనభస్మం..
తిండి తినేందుకూ ఓ పద్ధతి ఉండాలిగా..
బలవర్థక ఆహారం అక్రోట్