ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మునగ అంటేనే మూతి ముడుచుకుంటే నష్టం..  Search similar articles
Raju
దక్షిణ భారతదేశంలో అతి తేలికగా అందరి పెరటి తోటల్లోనూ పెంచుకోగల, అధిక పోషకవిలువలు గల కాయలను అందిస్తున్న వృక్షం మునగ. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలియా ఫెరా. దీన్ని మదర్స్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటారు. మునగకాయను కేవలం సువాసనకు, రుచికి మాత్రమే మన వంటకాల్లో వాడుతుండటం మనకు తెలుసు.

అయితే మునగ చెట్టులో ఆకులు, కాయలు, పుష్పాలు, బెరడు వంటి పలు భాగాలు ఇటు మానవులకు, అటు జంతువులకు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. పోషక విలువలు అధికంగా కలిగిన ఈ మునగ చెట్టుతో సమాజానికి కలుగుతున్న ఉపయోగాల తీరుతెన్నులను మనం చూద్దామా.... ముఖ్యంగా రక్తలేమికి అతి తరచుగా గురవుతుండే మహిళలకు మునగ ఆకు, కాయ, పువ్వుతో చేసే కూరలు చాలా ఉపయోగపడతాయి.

మునగ కాయలు....
రోగనిరోధక వ్యవస్థను, చర్మాన్ని మునగ కాయలు గట్టిపరుస్తాయి. బలహీనపడ్డ ఎముకలను గట్టిపర్చి, రక్తహీనతను పోగొట్టి తల్లికి బిడ్డకు అవసరమైన పోషణను ఇవి అందిస్తాయి. రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులను అరికట్టడమే కాక తలపోటును నివారిస్తాయి.

రాయలసీమ పల్లెల్లో విరివిగా పండే ఈ మునగ కాయల సీజన్‌లో కాయలను పెద్ద మొత్తంలో ఉడికించి దానికి వేరుసెనగ పొడి చల్లి పేపుడుగా చేసి కుటుంబ సభ్యులకు పళ్లేల్లో కాయముక్కలను వడ్డించి తినిపిస్తారు. సాయంత్రం పూట టిఫన్ లేదా బజ్జీలకు బదులుగా మునగ కాయలను గృహిణులు ప్లేట్లలో పోసి వడ్డించేవారు. వేయించిన మునగ కాయ తోలు, గుజ్జు, గింజ అన్నీ పోషక విలువలు కలిగి ఉండేవే. పైగా ప్లేట్లోని కాయలు మిగుల్చకుండా తినే పద్ధతిని అలవాటు చేసేవారు.

ఈ కాలంలో లాగా సుతారంగా కూరలో ఉడికిన మునగకాయ గుజ్జును మాత్రం చేతితో తీసుకుని కాయను పారవేయడం కాకుండా కాయను పూర్తిగా నమిలి పిప్పి అయేంతవరకూ తింటే కాయలోని తోలుకుండే పోషక నిల్వలు శరీరానికి అందడమే గాక పంటి చిగుళ్లు గట్టిపడతాయి.

మునగ ఆకులు...
మునగ ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఇతర ఆకుకూరలు లభ్యంకాని డ్రై సీజన్‌లో కూడా ఇది లభ్యం కావడం విశేషం. ఈ ఆకుల్లో కొవ్వు పదార్ధాలూ, కార్బొహైడ్రేట్లూ తక్కువే గాని, ఖనిజాలు, ఐరన్, విటమిన్ బి వంటివి అధికంగా ఉంటాయి. ఆకులను ఆవిరిలో ఉడికించి వేరుశెనగ పొడి కలపి వేయించి అన్నంలో కూరగా గాని, వేపుడుగా కాని తింటుంటారు. మునగాకు అపాన వాయువును నిరోధిస్తుంది.

వీటి ఆకులతో అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను, డయేరియాను నివారించవచ్చు. తాజా ఆకులతో తయారు చేసిన కషాయం ఎక్కువ లోతుగా లేని గాయాలనుంచి వచ్చే రక్తస్రావాన్ని ఆపుతుంది. అలాగే ఆకులను నలిపి వంటపాత్రలు, నేల, గోడలు శుభ్రం చేయడానికి క్లీనింగ్ ఏజెంట్‌గా వాడవచ్చు. మునగాకులను మన పశువులకు ఆహారంగాను, చర్మ ఇన్‌ఫెక్షన్‌లకు యాస్ట్రింజెంట్‌గా కూడా ఉపయోగించవచ్చు.
1 | 2  >>  
మరిన్ని
చర్మ సౌందర్యానికి దివ్యౌషధం ద్రాక్ష
డయాబిటీస్ మహిళలకు సరైన ఆహారం..
వేసవిలో మేలు చేసే పుచ్చకాయ  
మధ్యవయసు స్త్రీల ఆహార నియమాలు
గుడ్లు తింటే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గే అవకాశం..
నెలసరి కాలేదా... మీకోసం కాసీనభస్మం..